సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి
Published Thu, Jan 5 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM
ఆదోని అర్బన్ : వృత్తులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తే మరింత అభివృద్ధి చెందవచ్చని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సౌత్ జోన్ చైర్మన్ (మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్‌ఎంఈ) చంద్రమౌళి అన్నారు. బుధవారం కుమ్మరులకు సాంకేతిక ప్రక్రియపై ఐదురోజులు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిచేందుకు వచ్చిన ఆయన వీహెచ్‌పీ కార్యాలయంలో వారితో మాట్లాడారు. కులవృత్తులకు కేవీఐసీ మార్గదర్శకం వహిస్తోందని తెలిపారు. సాంకేతిక ప్రక్రియ ద్వారా అనేక ఉత్పత్తులు వివిధ రకాల డిజైన్లలో తయారు చేసేందుకు శిక్షణ నిస్తున్నట్లు తెలిపారు. రూ.600 కోట్ల వరకు ఎగుమతి ఆర్డర్లు ఉన్నాయన్నారు. కుండలు తయారు చేసేందుకు స్థలం చూపిస్తే ఉచితంగా బట్టీ నిర్మిస్తామని తెలిపారు.
రూ.33,444 కోట్ల టర్నోవర్..
కేవీఐసీ ద్వారా దేశవ్యాప్తంగా రూ.33,444 కోట్ల టర్నోవర్ జరిగిందని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రమౌళి పేర్కొన్నారు. పీఎంఈజీపీ స్కీం కింద గతేడాది ఏపీకి రూ.120 కోట్లు రుణాలు(రాయితీ రూ.42 కోట్లు) ఇచ్చామన్నారు. రీఫార్మ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద రూ.3 కోట్లతో కర్నూలు, రూ.4 కోట్లు అనంతపురంలో నేత కార్మికులకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రకాష్ జైన్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కునిగిరి నాగరాజు, వీహెచ్‌పీ జిల్లా, పట్టణ అధ్యక్షులు బసవన్న గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మారుతీరావు, ప్రొఫెసర్ చంద్రశేఖర్, శ్రీధర్, నాగరాజు గౌడ్, అప్పాస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్, మూర్తి, సునీల్ రెడ్డి, ఏబీవీపీ నాయకులు శ్రీనివాసాచారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement