ఇంటికి వెళ్తూ మృత్యువాత
Published Thu, Jun 1 2017 12:43 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
- లారీ ఢీకొని ఒకరు మృతి
– మరొకరికి గాయాలు
ఎమ్మిగనూరురూరల్: పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఒకరు మృత్యువాత పడగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎమ్మిగనూరు పట్టణ సమీపంలోని రైస్ మిల్లు వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె భీమక్క, వడ్డె వెంకటేశ్వర్లు కుమారుడు వడ్డె శివకుమార్(16) పట్టణంలో స్కూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సాయంత్రం పనులు ముగించుకొని సెల్‌షాప్‌లో పనిచేసే తమ గ్రామానికి చెందిన జిలాన్‌బాషాతో కలిసి స్కూటర్‌పై గ్రామానికి బయలుదేరారు. పట్టణం దాటిన తరువాత రైస్ మిల్లు దగ్గర స్కూటర్‌ను నిలిపి మూత్ర విసర్జన చేసి స్కూటర్‌ను స్టార్ట్ చేస్తుండగా కర్నూలు వైపు వేగంగా వెళ్తున్న లారీ వీరిని ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, స్కూటర్ పక్కన నిల్చున్న జిలాన్‌బాషాకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని చూసి.. అటుగా వెళ్తున్న వారు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో రక్తపు మడుగులో పడివున్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. మృతదేహన్ని పోస్టుమార్టుం కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.
Advertisement
Advertisement