- ఇంటì కో ఎల్‌ఈడీ బల్బు ఉచింతంగా పంపిణీ
డిజిటల్ ఇండియాలో మొదటి స్థానంలో ముక్ర (కే)
Published Tue, Aug 16 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
ఇచ్చోడ : వంద శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించడంతో ముక్ర (కే) దేశంలో మొదటి స్థానాన్ని సంపాదించినట్లు సీఎస్‌సీ నిర్వాహకుడు కొండ ప్రశాంత్ తెలిపారు. గ్రామంలో వంద శాతం అక్షరాస్యత సాధించడంతో అయన మంగవారం గ్రామంలో ఇంటికొక్క ఎల్‌ఈడీ బల్బును ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డిజిటల్ ఇండియాలో భాగంగా గ్రామంలో వంద శాతం అక్షరాస్యత సాధించినట్ల తెలిపారు.
తెలంగాణలో నాలుగో స్థానంలో ఎంపికైన గ్రామం ప్రస్తుతం దేశంలో మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. గ్రామ అభివద్ధి కమిటీ అధ్యక్షుడు గాడ్గే సుభాష్ మాట్లాడుతూ డిజిటల్ ఇండియాలో భాగంగా తమ గ్రామం దేశంలో మొదటి స్థానం సంపాదించడంపై గర్వంగా ఉందన్నారు. వంద అక్షరాస్యత సాధించడంతో తమ గ్రామంలో కుటంబానికి ఎల్‌ఈడీ బల్బులను ఉచితంగా సీఎస్‌సీ నిర్వహకుడు ప్రశాంత్ అదించడం పట్ల అయనను అభినందించారు. వారు అదించిన బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement