అనంతలో టీడీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గపోరు | dispute between prabhakar chowdary, jc diwakar reddy | Sakshi
Sakshi News home page

అనంతలో టీడీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గపోరు

Published Sat, Jan 30 2016 5:36 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

అనంతలో టీడీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గపోరు - Sakshi

అనంతలో టీడీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గపోరు

అనంతపురం: అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. రోడ్డు విస్తరణ విషయంపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఏర్పడ్డ వివాదం ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. శనివారం నగరంలోని ఓల్డ్ టౌన్లో ప్రభాకర్ చౌదరి సమావేశం ఏర్పాటు చేయగా, జేసీ వర్గీయులు అక్కడికి వెళ్లారు. పోలీసులు జోక్యం చేసుకుని జేసీ వర్గీయులను అడ్డుకున్నారు.

గత కొంతకాలం ఎంపీ జేసీ, ప్రభాకర్ చౌదరి మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఇటీవల ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతపురంలో రోడ్ల విస్తరణ చేస్తామని స్థానిక ఎంపీ జేసీ స్పష్టం చేయగా,  ప్రస్తుతం అవసరం లేదని ప్రభాకర్ చౌదరి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement