10న జిల్లా స్థాయి రైతు సదస్సు | district wide formars meeting on 10th | Sakshi
Sakshi News home page

10న జిల్లా స్థాయి రైతు సదస్సు

Published Mon, Nov 7 2016 6:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

district wide formars meeting on 10th

చింతలపూడి : చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతుల సమస్యలపై ఈనెల 10న స్థానిక మార్కెట్‌ కమిటీ ఆవరణలో జిల్లాస్థాయి రైతుల సదస్సును ఏర్పాటు చేసినట్టు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నేత ఘంటా మురళీరామకృష్ణ సోమవారం తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2018లోగా పూర్తి చేయడంతో పాటు, రైతులకు నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిపై మేధావులు, రైతు సంఘాల నాయకులు చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. రైతులు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు జిల్లాలోని రైతులు, రైతు సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, రైతులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement