వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి | Doctors must be vigilant | Sakshi
Sakshi News home page

వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి

Published Wed, Jul 20 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

బాలుడిని పరీక్షిస్తున్న డీఎంఅండ్‌హెచ్‌ఓ

బాలుడిని పరీక్షిస్తున్న డీఎంఅండ్‌హెచ్‌ఓ

  • డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్‌రావు
  • చండ్రుగొండ : వ్యాధులు ప్రబలే సీజన్‌ అయినందున వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్‌రావు ఆదేశించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు హై అలర్డ్‌ పీరియడ్‌ అని, ఈ సీజన్‌లోనే గ్రామాల్లో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో 658 గ్రామాలను హైరిస్క్‌గా గుర్తించామన్నారు. ఇప్పటికే ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే పూర్తి చేసి.. తగిన చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో ఉన్న 28 మంది డాక్టర్లు పైచదువులు నిమిత్తం సెలవుపై వెళ్లారన్నారు. వారి స్థానాలను అదనంగా ఉన్న డాక్టర్లతో తాత్కాలికంగా పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఉన్న 25.. 104 వాహనాలు మరమ్మతులకు గురికాగా.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో వాటిని బాగు చేయించామని తెలిపారు.
    హరిత వనాలు చేస్తాం..
    జిల్లాలో ఉన్న 60 పీహెచ్‌సీల ప్రాంగణాలను హరిత వనాలుగా మారుస్తామని, ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించామని డీఎంహెచ్‌ఓ తెలిపారు. లక్ష మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టామన్నారు. చండ్రుగొండలో పీహెచ్‌సీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామన్నారు. ఆయన వెంట జిల్లా మలేరియా అధికారి ఏ.రాంబాబు, క్లస్టర్‌ అధికారి భాస్కర్‌నాయక్, వైద్యాధికారి సీతారాంప్రసాద్, సీహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement