పోటా పోటీగా రాతిదూలం పోటీలు | doolam competetions in kalluru | Sakshi
Sakshi News home page

పోటా పోటీగా రాతిదూలం పోటీలు

Published Thu, Apr 6 2017 11:40 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM

doolam competetions in kalluru

గార్లదిన్నె  : మండల పరిధిలోని కల్లూరులో శ్రీరామ నవమిని పురస్కరించుకొని గురువారం గ్రామస్తులు ఆధ్వర్యంలో ఎగువపల్లి వద్ద రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుపోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 16 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పోటీలను వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు అమరేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రదీప్‌రెడ్డి  ప్రారంభించారు.

పోటీల్లో అనంతపురముకు చెందిన ఆచారి ఎద్దులు మొదటి స్థానంలో, పెద్దవడుగూరుకు చెందిన దస్తగిరి, అనిమిరెడ్డి ఎద్దులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు లక్ష్మినారాయణ, బృందావన్‌ రామాంజనేయులు, కేశవయ్య, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి నరేంద్ర, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చీమల రామక్రిష్ణ, తిరుపాల్, చితంబరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement