డబ్లింగ్‌ ట్రాక్, రైల్వేస్టేషన్ల తనిఖీలు | dubling and railway station checking | Sakshi
Sakshi News home page

డబ్లింగ్‌ ట్రాక్, రైల్వేస్టేషన్ల తనిఖీలు

Published Wed, Aug 23 2017 10:49 PM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

డబ్లింగ్‌ ట్రాక్, రైల్వేస్టేషన్ల తనిఖీలు

డబ్లింగ్‌ ట్రాక్, రైల్వేస్టేషన్ల తనిఖీలు

హిందూపురం అర్బన్‌: రైల్వే ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఎ.కె. గుప్త అన్నారు. డీఆర్‌ఎం ఆర్‌.ఎస్‌. సక్సెనా, అశోక్‌గుప్తలతో కలిసి బెంగళూరు నుంచి ప్రత్యేక రైలులో హిందూపురం చేరుకున్న ఆయన, పెనుకొండ, హిందూపురం మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులు పరిశీలించారు. అండర్‌ బ్రిడ్జి నిర్మాణాలపై అధికారులతో చర్చించారు. తర్వాత హిందూపురం రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు.

ప్రయాణికులకు మౌలిక సదుపాయలు కల్పించడంలో అలసత్వం ఉండబోరాదని సిబ్బందికి సూచించారు. రైలు ప్రయాణ వేళల డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటుపై సూచనలు అందించారు.  ఈ సందర్భంగా జీఎంకు మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు సన్మానం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ కార్యదర్శి శేఖర్‌, బ్రాంచ్‌ కార్యదర్శి కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సమస్యలు పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా వారు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement