Published
Sat, Sep 3 2016 10:30 PM
| Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
పొనుగోడు చెరువుకు నీరందించేందుకు కృషి
కనగల్ : ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు లిప్టు ఏర్పాటు చేసి పొనుగోడు చెరువుకు నీరందిస్తామని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వపై లిప్టు ఏర్పాటు చేసే ప్రదేశంతోపాటు చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా దుబ్బాక మాట్లాడుతూ తలాపున నీరున్నా తాగడానికి చుక్కలేదు అన్నచందంగా పొనుగోడు ప్రజల పరిస్థితి మారిందన్నారు. గ్రామ చెరువుకు నీరందించాలంటే లిప్టు ఏర్పాటు చేయడమెక్కటే మార్గమైనందున లిప్టు మంజూరుకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు దోరెపల్లికి చెందిన నకిరెకంటి బచ్చమ్మ మృతి చెందడంతో మృతురాలి కుటుంబ సభ్యులను దుబ్బాక పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎస్‌కే. కరీంపాష, పొనుగోడు సర్పంచ్ పులకరం క్షేత్రయ్య, మాజీ ఎంపీటీసీ, అడిషనల్ పీపీ నాంపల్లి నర్సింహ, నాయకులు దోటి శ్రీను, జోగు వెంకటేశం, ఊశయ్య, శ్రీనివాస్‌రెడ్డి, జ్వాల వెంకన్న, వెంకట్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, బాల్‌రెడ్డి, కట్ట స్వామి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.