ఇసుక అక్రమ రవాణాపై విచారణ
Published Wed, Feb 1 2017 11:54 PM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM
కోడుమూరు రూరల్ : కోడుమూరు మండలం గోరంట్ల హంద్రీనది నుంచి ఇసుక తరలింపుపై బుధవారం మైనింగ్ అధికారుల బృందం గ్రామంలో విచారణ చేపట్టారు. గోరంట్ల హంద్రీనది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలించరాదని గ్రామ పంచాయతీ తీర్మానం చేసినా అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారని, పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ గోరంట్ల, ఎర్రగుడి గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి ఆధ్వర్యాన అధికారుల బృందం గోరంట్లలో పర్యటించి హంద్రీనదిలోని ఇసుకను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో చర్చించి వివరాలను సేకరించారు. అంతకుముందు అధికారుల బృందం కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ఏఎస్‌ఓతో గ్రామ వివరాలను సేకరించారు. బృందం వెంట కోడుమూరు ఆర్‌ఐ మధుమతి, వీఆర్వో రామకృష్ణ ఉన్నారు.
Advertisement