'కేసీఆర్ ఆదర్శ రైతు.. అభినందనీయం' | errabelli settires on cm kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఆదర్శ రైతు.. అభినందనీయం'

Published Tue, Sep 29 2015 12:05 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

'కేసీఆర్ ఆదర్శ రైతు.. అభినందనీయం' - Sakshi

'కేసీఆర్ ఆదర్శ రైతు.. అభినందనీయం'

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పరోక్షంగా సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శ రైతు అని అభినందిస్తూనే ఎకరాకు కోటి రూపాయలు పండిస్తే మరి ఇజ్రాయెల్ కు వెళ్లడం ఎందుకో అని ప్రశ్నించారు. మెరుగైన పంటల పరిశీలనల పేరిట ఇజ్రాయెల్, చైనా వెళ్లారని, మరి ఆ టూర్లకు రైతులను తీసుకెళ్లారా అని నిలదీశారు.

తక్కువ పొలంలో ఎక్కువ దిగుబడిని తీసుకొచ్చే కేసీఆర్ ఎమ్మల్యేలను, రైతులను ఆయన ఫాం హౌజ్కు తీసుకెళితే తాము కూడా నేర్చుకుంటామని చెప్పారు. ముందు ఫాం హౌజ్ రైతులకు సబ్సిడీ ఇవ్వడం ఆపేసి పేద రైతులకు సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. సీఎం ఫాం హౌజ్లో పంటలు పండించినట్లుగానే మిగితా ప్రాంతాల్లో కూడా రైతులు పంటలు పండిచేలా కృషి చేస్తే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement