
ఓ నకిలీ వైద్యురాలు అరెస్టు
మంచిర్యాల(ఆదిలాబాద్): ఓ నకిలీ వైద్యురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నాగమణి చందూ పేరుతో వైద్యం చేస్తున్న భూక్య నాగమణిని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రి నిర్వాహకుల ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు ఎఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.