తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: కుటుం బ వ్యవస్థను కాపాడుకోవడం ద్వారా నే మానసిక, ఆరోగ్య రుగ్మతలు దూ రమవుతాయని తిరుపతి శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీ వైస్ చా న్సలర్ డాక్టర్ రత్నకుమారి అభిప్రాయపడ్డారు. ఇండియన్ సైక్రియాట్రి క్ సొసైటీ ఆధ్వర్యంలో ‘‘జెండర్ డి వైడ్ అండ్ మ్యారేజ్-మెంటల్ హెల్త్ అండ్ లీగల్ ఇష్యూస్’’ అనే అం శం పై రెండురోజుల మానసిక వైద్యుల జాతీయ సదస్సు శనివారం తిరుపతిలో ప్రారంభ మైంది. స్థానిక రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు డాక్టర్ రత్నకుమారి ముఖ్య అతి థిగా హాజరై ప్రసంగించారు.
మానసిక ఆరోగ్య ఇబ్బందుల కారణంగా స మాజంలో ప్రస్తుతం అనేక అరాచకాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విడాకులు తీసుకున్న దంపతులు, నిత్యం గొడవలుపడే దంపతుల తీరుతో పిల్లల్లో అరాచక భావాలు పెరిగేందుకు ఎ క్కువ దోహదం చేస్తాయని తెలిపా రు. పెళై ్లన ఏడాదిలోపే విడాకులు తీ సుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుండడం కూడా సమాజాభివద్ధికి ఆటంకంగా మారుతోందని తెలిపా రు. అలాంటి పరిస్థితుల నుంచి కు టుంబ వ్యవస్థను కాపాడడానికి దం పతులకు కౌన్సెలింగ్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉందని వివరించారు.
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు ఫ్రొఫెసర్ ఇందిరాశర్మ మాట్లాడుతూ వివిధ వైద్య అంశాలకు సంబంధించి నిర్వహిస్తు న్న నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల న్నారు. అంతకుముందు రుయా చి న్నపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ వీరాస్వామి, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, సదస్సు కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రసాదరావు ప్రసంగించారు. ఇండియన్ సైక్రియాట్రిక్ సొసైటీ జాతీయ ఉపాధ్యక్షుడు టీవీ అశోకన్, దేశంలోని వివిధ రా ష్ట్రాలకు చెందిన మానసిక వైద్య నిపుణులు పవన్‌కుమార్, కిషన్, పీకే సింగ్, వినయ్‌కుమార్, కిషోర్, రా మ్‌మనోహర్, 400 మంది వైద్యులు హాజరయ్యారు.
కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి
Published Sun, Aug 11 2013 3:33 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement