నేటి తరం.. ఒక కన్‌ఫ్యూజన్. తానేంటో తనకే తెలియదు. తనకు ఎలాంటి లైఫ్ పార్టనర్ కావాలో తెలియదు. అవతలి వ్యక్తి పర్సనాలిటీని కనిపెట్టలేరు. ఉద్రేకంతో మోహించి , అదే ప్రేమ అని భ్రమించి పెళ్ళాడి , మోజు తీరగానే కొట్లాడి పెటాకులు తెచ్చుకొని, ఇక పెళ్లి యుగం అయిపోయిందని తీర్పులు ఇస్తున్న చదువుకొన్న నాగరికులు. అయినా తప్పు వీళ్లది కాదు వీళ్ల చదువులది. అది అమెరికాలో ఉద్యోగం అయితే ఇప్పించింది. కానీ ఎలా బతకాలో చెప్పలేదు. ఇంకేముంది బతుకు బస్టాండ్ ,ఆపై డిప్రెషన్‌లు, సూసైడ్‌లు...
పెళ్ళయితే ?.. భార్య భార్య / భర్త , పిల్లలే సంసారం. పెళ్లికి లీవ్, హనీమూన్‌కి లీవ్, మెటర్నిటీ లీవ్.. పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే రెండు, మూడు రోజులు లీవ్. భార్య,భార్తల్లో ఎవరికి ట్రాన్స్‌ఫర్ అయినా మరొకరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అదేమంటే, ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాతే ఉద్యోగం అంటారు.
ఇప్పుడప్పుడే పెళ్లి గట్రా వద్దంటున్నారు ఈ బ్రహ్మచారులు. 30దాటినా.. అప్పుడే పెళ్లికి, లివ్‌ఇన్‌కి తొందరేముంది? అంటూ నిర్మొహమాటంగానే చెప్పేస్తున్నారు. ఆపై ఉద్యోగమే సర్వస్వం అనుకొని కంపెనీ బానిసలుగా బతుకీడుస్తున్నారు. ఆఫీస్ జిందాబాద్, పెళ్లి, కుటుంబం డౌన్‌డౌప్ అంటూ పిచ్చి వాగుడు వాగేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరి కుటుంబం ఛిన్నాభిన్నమేనా?
మావోయిస్టుల కాలంలో చైనాలో.. “కుటుంబ వ్యవస్థ మనిషిలో స్వార్థాన్ని పెంపోందిస్తుంది.. కానీ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తేనే అసలుసిసలు కమ్యూనిజం వస్తుంది” అని పెద్ద ప్రయత్నం జరిగింది. కానీ కొన్నాళ్లకే అది తస్సుమంది. యాభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కాపిటలిస్ట్ అమెరికాలో బహుళ జాతి కంపెనీలు.. కంపెనీ బానిసలను తయారుచేయడం కోసం ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాయి. మన దగ్గర్నుంచి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన మనోళ్లు(కొత్తతరం) ఈ ట్రాప్‌లో పడిపోయి పెళ్లి శకం ముగిసింది అని బ్రహ్మచారి జీవితానికి సిద్ధమయిపోతున్నారు.
-ఈ వెస్ట్రన్ కల్చర్ ఇప్పుడు మన దేశంలోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇంకా ఈ ట్రెండ్ ముదిరిపోక ముందే వేకప్ కాల్ అనుకొని పరిస్థితులను సమీక్షిస్తే మంచిది.
వాసిరెడ్డి అమర్ నాథ్
మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త
Comments
Please login to add a commentAdd a comment