కరెంట్ షాక్తో రైతు మృతి | farmer death due to current shock in karimnagar district | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్తో రైతు మృతి

Published Sat, Aug 8 2015 1:48 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

farmer death due to current shock in karimnagar district

కరీంనగర్ : వ్యవసాయ బావి వద్ద పని చేసుకుంటున్న రైతు ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు.  ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన వెంక య్య (39) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ రోజు ఉదయం బావి వద్దకు వెళ్లిన అతడు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజు వేసేందుకు ప్రయత్నిస్తుండగా.. విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. చిన వెంకయ్య మృతితో ఉద్రిక్తులైన గ్రామస్థులు అధికారుల నిర్లక్ష్యం వల్లె ఈ ప్రమాదం జరిగిందని నిరసిస్తూ విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

దాంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విద్యుత్ కార్యాలయానికి వచ్చి ఆందోళనకు దిగిన రైతులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement