విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Wed, Feb 8 2017 12:34 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
ఎమ్మిగనూరు రూరల్: కె.తిమ్మాపురం గ్రామంలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన బీజీ విరుపాక్షినాయుడు, శారద దంపతుల రెండో కుమారుడు సురేంద్రనాయుడు(25) మంగళవారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. అయితే మోటారుకు విద్యుత్సరఫరా కాకపోవంతో మోకానిక్‌కు సమాచారం ఇచ్చాడు. మోకానిక్ రావటం ఆలస్యం కావటంతో తానే ఫీజును సరి చేసే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై కేకలు వేస్తూ పడిపోయాడు.
పక్క పొలాల్లో పని చేస్తున్న రైతులు వచ్చి చూసే సరికి అప్పటికే మృతి చెందాడు. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ వేణుగోపాల్ విలేకరులకు తెలిపారు. మృతుడు సురేంద్రనాయుడు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు బీజీ మాదన్న మనవడు కావటంతో పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీ నాయకులు తరలివచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎంపీపీ వాల్మీకి శంకరయ్య, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు వై.రుద్రగౌడ్, సీపీఐ జిల్లా నాయకులు రామాంజనేయులు, విశాలాంధ్ర మేనేజర్ నాగరాజు, స్థానిక నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Advertisement