పాల్వంచ మండలంలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతిచెందాడు
పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మొండికట్ట గ్రామానికి చెందిన బొడ్డు కొమురమ్య(49) మంగళవారం ఉదయం పంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.