ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి | Farmer killed accidentally fell into the well | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి

Published Mon, Aug 22 2016 12:12 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

యాదయ్య మృతదేహం - Sakshi

యాదయ్య మృతదేహం

ఖమ్మంరూరల్‌ : మండలంలోని ఆరేకోడులో ప్రమాదశాత్తు వ్యవసాయబావిలో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సిలివేరు యాదయ్య (60) తన స్వంత పొలానికి నీళ్లు పెట్టేందుకు బావి వద్ద మోటారు ఆన్‌ చేయబోయే క్రమంతో కాలు జారి బావిలో పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో అక్కడే పొలంలో దూరంగా ఉన్న యాదయ్య కుమారుడు ఉరుకున వచ్చి చూడగా బావిలో మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement