అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఆదోని టౌన్: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హొళగుంద మండలం హెబ్బటం గ్రామానికి చెందిన రైతు మాల తిక్కయ్య(55)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. పత్తి, మిరప సాగు చేస్తుండగా రెండు మూడేళ్ల నుంచి దిగుబడి తగ్గిపోయింది. సాగుకు చేసిన అప్పులు, కుటుంబ పోషణ భారం కావడంతో అప్పులు రూ.3లక్షలకు చేరుకున్నాయి. రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో సోమవారం రాత్రి ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మరణించాడు. మృతునికి భార్య ఓంకారమ్మ, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు సంతానం.