ఇరిగేషన్ పనుల్లో అవినీతిపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు
Published Fri, Sep 9 2016 1:23 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
విడవలూరు: జిల్లాలో రెండేళ్లుగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన వివిధ పనుల్లో సుమారు రూ.300 కోట్ల అవినీతి జరిగినట్లు విడవలూరు మండలానికి చెందిన రైతులు బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, అనపల్లి ఉదయ్‌భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం కేసును స్వీకరిస్తూ (డీడబ్ల్యూపీ నంబర్ 161672) నిర్ణయం తీసుకుంది. హైకోర్డులో రైతులు వేసిన పిటిషన్‌లో జిల్లాలో నీటిపారుదలశాఖ కింద జరిగిన పనుల్లోని అవినీతిని వెలికి తీయాలంటే తప్పక సీబీఐతో విచారణ చేయాలని రైతులు ప్రధానంగా పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో జిల్లాలో నీరు–చెట్టు, ఎఫ్‌డీఆర్, ఓఅండ్‌ఎం కింద జరిగిన వివిధ పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అండతో విడవలూరు, కొడవలూరు మండలాల్లో రూ.35 కోట్లతో నీటిపారుదల శాఖలో పనులు చేశారని పేర్కొన్నారు. ఇందులో నీరు–చెట్టు కింద చేసిన పనులను తిరిగి ఉపాధి హామీలో, ఎఫ్‌డీఆర్‌లో పనులు చేశారని తెలిపారు. ఈ పనుల్లో ఆ ప్రజాప్రతినిధి, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు భారీ అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ అవినీతిపై విచారణ చేసి అవినీతిని నిగ్గు తేల్చాలని లోకాయుక్తను ఆశ్రయించిన రైతులు అనంతరం క్వాలిటీ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా కలెక్టర్, విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.
తమ్ముళ్లలో గుబులు
ఇరిగేషన్ పనులలో భారీ అవినీతిపై పెన్నాడెల్టా రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో పాటు సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడంతో కోవూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగు
Advertisement
Advertisement