కొనసాగుతున్న ఆమ‘రణం’
-
సిరిసిల్ల జిల్లా సాధన సమితి మౌన ప్రదర్శన
-
వైద్యానికి నిరాకరణ
-
క్షీణిస్తున్న గాజుల, మనోజ్ ఆరోగ్యం
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా సాధనకు గాజుల బాలయ్య, రిక్కుమల్ల మనోజ్ చేపట్టిన ఆమరణ దీక్షలను ప్రాంతీయ ఆస్పత్రిలో కొనసాగిస్తున్నారు. అర్బన్‌బ్యాంకు మాజీ చైర్మన్ గాజుల బాలయ్య, స్థానిక యువకుడు రిక్కుమల్ల మనోజ్‌కుమార్ సిరిసిల్ల జిల్లా సాధనకు ఆమరణదీక్షలు చేపట్టగా.. పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం వైద్యసేవలను నిరాకరించారు. జిల్లా సాధన కోసం ప్రాణత్యాగానికైన సిద్ధమని మనోజ్‌కుమార్ ప్రకటించారు. సిరిసిల్ల టౌన్ ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, ఏఎస్సై చీనానాయక్ వచ్చి వైద్యం చేయించుకోవాలని కోరగా.. మంత్రి కేటీఆర్ సిరిసిల్లపై జిల్లాపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే ఆస్పత్రిలో దీక్షలు కొనసాగిస్తున్న వీరికి పరామర్శలు వెల్లువెత్తాయి.
జిల్లా సాధన సమితి మౌన ప్రదర్శన
సిరిసిల్ల జిల్లా సాధన సమితి, అఖిలపక్ష నాయకులు ఆదివారం పట్టణ వీధుల్లో మౌన ప్రదర్శన నిర్వహించారు. నోటికి నల్ల గుడ్డను కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల అంబేద్కర్‌చౌరస్తా, గాంధీచౌక్ వరకు ర్యాలీ తీశారు. సాధన సమితి ప్రతినిధులు బుస్సా వేణు, పోకల శ్రీనివాస్, చేపూరి అశోక్, రాగుల రాములు, అఖిల పక్ష నాయకులు సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, జక్కుల యాదగిరి, వెల్ముల తిరుపతిరెడ్డి, జగ్గాని మల్లేశం, బుర్ర మల్లేశం, అన్నల్‌దాస్ వేణు, నంది శంకర్, కంసాల మల్లేశం, గడ్డం నాగరాజు, అంబాల మల్లేశం, బూర శ్రీనివాస్, సోమిశెట్టి దశరథం, కుస్మ విష్ణుప్రసాద్, పాకల శంకర్‌గౌడ్, జక్కని నవీన్, మోర రవి, లింగంపల్లి సత్యనారాయణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.