
తండ్రి మందలించాడని..
మద్దికెర: ఎం.అగ్రహారంలో తండ్రి మందలించాడని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన జయకర్ణ కుమారుడు భాస్కర్ (14) 9వ తరగతి చదువుతూ మధ్యలోనే మానేశాడు. చెడు సాహసాలు చేయవద్దని మంగళవారం తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన కుమారుడు క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మతి చెందాడు. సమాచారం అందుకున్న మద్దికెర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.