అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా ఏప్రిల్‌లో జరిగే పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి పరీక్షల ఫీజులు చెల్లించేందుకు శుక్రవారంతో గడువు ముగిసింది. అయితే తత్కాల్ స్కీం కింద శనివారం నుంచి ఈనెల 13 వరకు ఫీజు చెల్లించేందుకు మరో అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు.