హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ సాధిస్తా | fight for husnabad revenu division | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ సాధిస్తా

Published Thu, Sep 8 2016 8:12 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

fight for husnabad revenu division

  • ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్‌
  • హుస్నాబాద్‌రూరల్‌ : హుస్నాబాద్‌ ప్రాంత ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్‌ చేసి సిద్దిపేట జిల్లాలో కలపనున్నట్లు ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్‌ తెలిపారు.  గురువారం విలేకరులతో మాట్లాడారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత హుస్నాబాద్‌లో అఖిలపక్షం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకుంటే అత్యధికంగా రెవెన్యూ డివిజన్‌ చేసి సిద్దిపేటలో కొనసాగించాలని చెప్పినట్లు స్పష్టం చేశారు. మద్దూరు, చేర్యాల, నంగునూర్, కోహెడ, హుస్నాబాద్, హుస్నాబాద్‌ కొత్త మండలంతో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఏదేమైనా హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ సాధిస్తామని హామీ ఇచ్చారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్‌ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీలు భూక్య మంగ, సంగ సంపత్, ఉప్పుల స్వామి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లింగాల సాయన్న, కోహెడ జెడ్పీటీసీ పొన్నాల లక్ష్మణ్, వైస్‌ ఎంపీపీ రాంగోపాల్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, బీలునాయక్‌ పాల్గొన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement