గాయాల పాలైన శ్రీనివాసరావు (ఫైల్)
ఇరువర్గాల మధ్య ఘర్షణ
Published Tue, Nov 8 2016 8:54 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
వ్యక్తికి తీవ్రగాయాలు
ఈపూరు: పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, పలువురికి స్వల్పగాయాలయ్యాయి. మండల కేంద్రమైన ఈపూరులో మంగళవారం జరిగిన సంఘటన వివరాలు... ఈపూరుకు చెందిన మద్దం దేవేంద్ర, చిట్టేటి వెంకటేశ్వర్లుకు పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి ముందు ట్రాక్టర్ నిలబెట్టే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చిట్టేటి వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పోలీస్ స్టేషన్‌లోనే ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోగా పలువురికి స్వల్పగాయాలయ్యాయి. అనంతరం శ్రీనివాసరావును తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మిగతావారు కూడా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై ఎసై ్స ఉజ్వల్‌కుమార్‌ను వివరణ కోరగా ఇంకా ఎవరిపై కేసు నమోదు చేయలేదన్నారు.
Advertisement
Advertisement