ప్రమాదం జరిగిన ప్రదేశం
అరబిందో పరిశ్రమలో అగ్ని ప్రమాదం
Published Fri, Aug 19 2016 11:54 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
–కార్మికుడి మృతి
రణస్థలం : పైడి భీమవరంలోని అరబిందో ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామానికి చెందిన ఎస్.అప్పలరాజు (29) అరబిందో పరిశ్రమలో కార్మికునిగా పని చేస్తున్నాడు. శుక్రవారం హెచ్‌ఎండీఎస్ బ్లాక్‌లోని టోలీన్ కెమికల్ విభాగంలో అప్పలరాజు విధుల్లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్పలరాజు మృతి చెందాడు. మృతదేహాన్ని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకుని బోరున విలపించారు. అప్పలరాజు మృతి చెందినా బతికే ఉన్నాడంటూ పరిశ్రమ యాజమాన్యం ఆస్పత్రికి తరలించిందని వాపోయారు. కాగా, కుటుంబ సభ్యులను, మీడియాను పరిశ్రమలోకి అనుమతించకపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం అనుమతించారు. పరిశ్రమ యాజమాన్యంతో సీఐటీయూ నాయకులు చర్చలు జరుపుతున్నారు. పరిశ్రమలో జరిగిన నష్టాలను అంచనా వేయాల్సి ఉందని యాజమాన్య సిబ్బంది తెలిపారు.
Advertisement
Advertisement