కోడుమూరులో అగ్ని ప్రమాదం
కోడుమూరులో అగ్ని ప్రమాదం
Published Tue, Apr 25 2017 10:50 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
- 3గుడిసెలు, గడ్డివామి దగ్ధం..
- రూ.6లక్షల ఆస్తి నష్టం..
కోడుమూరు రూరల్: పట్టణంలోని గొల్లవీధిలో ప్రమాదవశాత్తూ గడ్డివాముకు నిప్పంటుకొని పక్కనే ఉన్న మూడు నివాస గుడిసెలు దగ్ధమైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన రైతు నక్క గోరంట్లకు చెందిన గడ్డివాముకు నిప్పంటుకొని గాలికి పక్కనే ఉన్న సుశీలమ్మ, సరోజమ్మ, గిడమ్మ, జైపాల్ గుడిసెలకు మంటలు వ్యాపించాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. సుశీలమ్మ, సరోజమ్మ కొట్టాలు పూర్తిగా కాలిపోవడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. జైపాల్ టీ దకాణం కాలిపోగా, గిడ్డమ్మ రేకుల షెడ్డు మంటల వేడికి సగానికి పైగా దెబ్బతింది. అగ్ని ప్రమాదంలో సుమారు రూ.6లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.
యువకుల సాహసం
ఒక వైపు గాలికి ఎగిసిపడుతున్న మంటలను సైతం లెక్కచేయకుండా కాలనీ యువకులు బకెట్లు, బిందెలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. 2గంటలకు పైగా యువకులు, అగ్నిమాపక సిబ్బంది పోరాడి మంటలు మిగతా గుడిసెలకు వ్యాపించకుండా నివారించగలిగారు.
Advertisement