హోరా హోరీగా ఫుట్‌బాల్‌ పోటీలు | football league in anantapur | Sakshi
Sakshi News home page

హోరా హోరీగా ఫుట్‌బాల్‌ పోటీలు

Published Fri, Jan 20 2017 11:47 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

హోరా హోరీగా ఫుట్‌బాల్‌ పోటీలు - Sakshi

హోరా హోరీగా ఫుట్‌బాల్‌ పోటీలు

- సెమీస్‌లో గుత్తిటౌన్‌, అకాడమీ జట్లు
- మరో సెమీస్‌లో తలపడనున్న ధర్మవరం, కొనకొండ్ల


అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అండర్‌–13 ఫుట్‌బాల్‌ లీగ్‌  పోటీలు శుక్రవారం స్థానిక అనంత క్రీడా మైదానంలో హోరాహోరీగా సాగాయి. సెప్టెంబర్‌ నుంచి జిల్లాలో వివిధ జట్ల మధ్య లీగ్‌ పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి ఫుట్‌బాల్‌ లీగ్‌ పోటీలకు గుత్తిటౌన్, అనంతపురం ఆర్‌డీటీ అకాడమీ జట్టు, ధర్మవరం, కొనకొండ్ల, కొత్తచెరువు, పరిగినార్త్, ఆత్మకూరు, హిందూపురం టౌన్‌ జట్లు అర్హత సాధించాయి. ఇందులో భాగంగానే శుక్రవారం నుంచి జిల్లాస్థాయి లీగ్‌ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నాగరాజు, ట్రెజరర్‌ భాస్కర్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఫుట్‌బాల్‌ అభివృద్ధికి ఆర్‌డీటీ సంస్థ ఎనలేని కృషి చేస్తోందన్నారు. క్రీడాకారుల్లో దాగిఉన్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నీలు ఎంతగానో దోహదపడతాయన్నారు.

స్కోర్‌ వివరాలు
అనంతపురం ఆర్‌డీటీ స్పోర్ట్స్‌ అకాడమీ జట్టు, కొత్తచెరువు జట్లు తలపడగా ఆర్‌డీటీ అకాడమీ జట్టు 12–0తో విజయం సాధించింది. జట్టులో ప్రణీత్‌–4, మహేంద్ర–2, బాబు–2, చిన్నా–1, బాబా–1, అవినాష్‌–1, విష్ణు–1 గోల్స్‌ సాధించారు. పరిగి నార్త్, గుత్తి టౌన్‌ జట్లు తలపడగా గుత్తి టౌన్‌ జట్టు 6–2తో విజయం సా«ధించింది. జట్టులో వినయ్‌–4, హేమంత్‌–1, సుభాష్‌–1 గోల్స్‌ చేశారు. కొనకొండ్ల, హిందూపురం టౌన్‌ జట్లు తలపడగా కొనకొండ్ల జట్టు 6–2తో గెలుపొందింది. జట్టులో కళ్యాణ్‌–4, ఉమేష్‌–1, గిరీష్‌–1లు గోల్స్‌ చేశారు. ఆత్మకూరు, ధర్మవరం జట్లు తలపడగా ధర్మవరం జట్టు 3–0తో గెలిచింది. జట్టులో తేజ–2, ఆత్మకూరు జట్టులోని అజయ్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసి ధర్మవరం జట్టును గెలిపించాడు.

నేడు సెమీస్‌
గుత్తి టౌన్, అనంత అకాడమీ జట్లు మొదటి సెమీస్‌లో, ధర్మవరం, కొనకొండ్ల జట్లు రెండవ సెమీస్‌లో శనివారం తలపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement