విత్తనాల కోసం తొక్కిసలాట
–పోలీసుల పహారా మధ్య కూపన్ల పంపిణీ
ముద్దనూరు: స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద శనివారం జరిగిన శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఎస్‌ఐ నరసింహారెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు. మహిళలు, పురుషులకు ప్రత్యేక క్యూలైను ఏర్పాటు చేయించారు. దీంతో కూపన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగింది. చివరి వరకు పోలీసుల పహారా మధ్యనే కూపన్ల అందజేశారు. మండలంలోని నల్లబల్లె, చిన్నదుద్యాల గ్రామాలకు చెందిన రైతులు కూపన్లు అందకపోవడంతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.