- బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి
రాజకీయ స్వార్థం కోసమే విభజన ప్రక్రియ
Published Sun, Aug 28 2016 12:22 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM
వర్ధన్నపేట : రాజకీయ స్వార్ధం కోసం సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపిం చారు. స్థానిక ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనను బీజేపీ స్వాగతిస్తుందన్నారు. కొన్ని జిల్లాల ఏర్పాటులో ప్రజల అభీ ష్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ ముందుకెళ్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయుల కాలం నుంచి వరంగల్, హన్మకొండ నగరాలకు విడదీయరాని బంధం ఉందన్నారు. వీటిని విడదీసి ఈ ప్రాంత వైభవాన్ని కోల్పోయేలా వ్యవహరిస్తున్నారని దు య్యబట్టారు. హన్మకొండ జిల్లా చేయవద్దని అఖిల పక్ష సమావేశంలో తాము డిమాండ్ చేశామని గుర్తుచేశారు. ప్రభుత్వ వైఖ రికి నిరసనగా ఈ నెల 30న జిల్లా బంద్‌కు పిలుపునచ్చినట్లు ప్రకటించా రు. సెప్టెంబర్ 17న వరంగల్‌లో తిరంగ్‌యాత్ర చేపడుతున్నట్లు వెల్లడిం చారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వరంగల్‌కు వస్తున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు జడ సతీష్, జిల్లా కార్యదర్శి యాకయ్య, ప్రధాన కార్యదర్శి దిండు కిషన్, రాయపురం కుమారస్వామి, గుజ్జ ప్రవీణ్, చిర్ర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement