అటవీ చట్టం కింద 16 మందిపై కేసు
Published Tue, Jul 19 2016 10:16 PM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
కడెం : మండలంలోని పాండ్వాపూర్ గ్రామ సమీపంలోని 727 కంపార్టుమెంటు పరిధిలో రిజర్వు ఫారెస్టు భూమిలో అనుమతి లేకుండా పొరకలు తొలగించిన 16 మంది గిరిజనులపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్వో నాగయ్య తెలిపారు. టైగర్‌జోన్ పరిధిలోని ఈ ప్రాంతంలో గిరిజనులు భూమిని సాగు చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ మేరకు వారిపై అటవీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Advertisement
Advertisement