పూర్వ కలెక్టర్ దుర్గాదాస్ కన్నుమూత
- ముంబాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
అనంతపురం : జిల్లాలో కలెక్టర్‌గా పని చేసిన దుర్గాదాస్ మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో కన్నుమూశారు. ఈయన జిల్లాలో 2011 నుంచి 2013 మధ్య కాలంలో పని చేశారు. జిల్లాలో పని చేసిన కాలంలో ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇక్కడ పని చేస్తున్న రోజుల్లోనే క్యాన్సర్ బారిన పడ్డారు. అప్పటి నుంచి చికిత్స చేయించుకుంటున్నారు. ఇటీవల కాలంలో వ్యాధి ముదరడంతో ముంబాయిలోని టాటా మెమోరియల్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తీవ్రతరం కావడంతో మరణించారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గాదాస్ షిర్డీసాయిబాబాను అత్యంత దైవంతో కొలిచేవారు. బుధవారం ఉదయం అంత్యక్రియలు కూడా షిర్డీలోనే నిర్వహిస్తున్నట్లు బంధువర్గాల ద్వారా తెలిసింది.