4 లక్షల టన్నుల చెరకు గానుగ లక్ష్యం
-
తోటలను పరిశీలించిన అసిస్టెంట్ కేన్ కమిషనర్ లోకేశ్వర్
నాయుడుపేట: జిల్లాలో సూదులగుంట షుగర్ ఫ్యాక్టరీ, ఎంపీ చక్కెర కర్మాగారాల పరిధిలో 4లక్షల టన్నుల చెరకు గానుగ లక్ష్యమని జిల్లా అసిస్టెంట్ కేన్ కమిషనర్ కె.లోకేశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని చెరుకు తోటలను శనివారం కమిషనర్ పరిశీలించారు. కాపులూరు, కూచివాడ, గునపాడు, పెన్నేపల్లి, పెళ్లకూరు మండలం చెంబేడు, చావాలి గ్రామాలలో చెరకు పంట నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేన్ కమీషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 1,611 టన్నులు ఎంపీ షుగర్స్ ఫ్యాక్టరీలోనూ, 27,259 టన్నులు సూదులగుంట షుగర్ ఫ్యాక్టరీలో గానుగ ఆడించినట్లు తెలిపారు. టన్నుకు రూ.2,500లు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎంపీ షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ మాట్లాడుతూ విత్తన తోటలకు ఎకరానికి నాలుగు టన్నుల చెరకును ఉచితంగా ఫ్యాక్టరీ అందిస్తుందని తెలిపారు. ఆయన వెంట సీఈఓ శివరామ్‌ప్రసాద్, క్షేత్రస్థాయి ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు.