నేటి నుంచి అఖిల భారత స్థాయి నాటిక పోటీలు | FROM TO DAY AKHILA BHARATASTAIE NATAKA POTELU | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అఖిల భారత స్థాయి నాటిక పోటీలు

Published Wed, Apr 5 2017 11:19 PM | Last Updated on Sat, Aug 25 2018 5:22 PM

నేటి నుంచి అఖిల భారత స్థాయి నాటిక పోటీలు - Sakshi

నేటి నుంచి అఖిల భారత స్థాయి నాటిక పోటీలు

వీరవాసరం : తెలుగుజాతి గర్వించదగిన జాతీయ కవి చిలకమర్తి లక్ష్మీ నర్సింహం పంతులు నడయాడిన వీరవాసరంలో చిలకమర్తి పేరుతో ఏర్పాటు చేసిన కళా ప్రాంగణంలో వీరవాసరం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయి నాటిక పోటీల అష్టమ వార్షికోత్సవానికి సర్వం సన్నద్ధం చేశారు. కళాత్మక, సందేశాత్మక నాటకాలను పోషిస్తూ సీనియర్‌ జర్నలిస్ట్‌ గుండా రామకృష్ణ ఎనిమిదేళ్ల నుంచి ఈ నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగు సినీ దర్శక, నిర్మాతలు, నటులను సన్మానిస్తూ నాటకోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను గురువారం నుంచి పదో తేదీ వరకు శ్రీ గుండా లక్ష్మీ రత్నావతి కళా వేదికపై నిర్వహిస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement