⇒ కరెంట్ మీటర్ల ఏర్పాటులో వసూళ్ల పర్వం
⇒ మీటర్ల బిగింపును ఏజెన్సీకి అప్పగించిన ఎన్‌పీడీసీఎల్
ఖమ్మం: డిజిటల్ మీటర్ల ఏర్పాటులో ఏజెన్సీ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో మీటర్‌కు రూ.200 వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ శాఖలో ముడుపులు ముట్టజెప్పనిదే పని జరగదనడానికి ఈ వ్యవహారం నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ మీటర్ల స్థానంలో స్కానింగ్ ద్వారా రీడింగ్‌ను తీసుకునే డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఎన్‌పీడీసీఎల్ నగదు ఇచ్చినా, సదరు సిబ్బంది వినియోగదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల ద్వారా రీడింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని ఎన్‌పీడీసీఎల్ గుర్తించింది. ఈ మీటర్లనుంచి విద్యుత్ విని యోగం రీడింగ్ చేస్తున్న సమయంలో ఎక్కువ విద్యుత్ వాడినప్పటికీ.. తక్కువ రీడింగ్ చూప డం.. మరికొన్ని చోట్ల తక్కువ రీడింగ్ చూపి నా.. ఎక్కువ బిల్లులు రావడం తదితర ఘట నలు చోటుచేసుకుంటున్నాయి. ఏసీ,ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్న వారు.. ఎక్కువ బిల్లు వచ్చిన నెలలో ప్రైవేట్ ఆపరేటర్‌తో మా ట్లాడుకుని బిల్లు తక్కువ వచ్చేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటువంటి అవకతవకలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఎన్‌పీడీసీఎల్ కొత్తగా డిజిటల్ మీటర్లను అమర్చాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఖమ్మం సర్కిల్ పరిధిలోని రెండు జిల్లాలో డిజిటల్ మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఒక్కో మీటర్ ఏర్పాటుకు రూ.500 చొప్పున ఇస్తున్నారు.
ప్రతి ఇంటికి డిజిటల్ మీటరు
విద్యుత్ బిల్లులు సక్రమంగా వచ్చేందుకు ప్రస్తు తం ఖమ్మం సర్కిల్ పరిధిలోని ఖమ్మం, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఐఆర్‌డీఏ డిజిటల్ మీటర్లను అమరుస్తున్నారు. మొత్తం 6,61,737 డిజిటల్ మీటర్లను అమర్చాల్సి ఉంది. ఈ పనిని కూడా ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. వీరు ప్రస్తుతం డిజిటల్ మీటర్లను అమర్చే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 3,17,737 డిజిటల్ మీటర్లను అమర్చారు. మరో 3.44లక్షల డిజి టల్ మీటర్లను అమర్చాల్సి ఉంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు.
మీటర్ల ఏర్పాటులో చేతివాటం
ప్రతి ఇంటిలో డిజిటల్ మీటర్‌ను అమర్చే పనులను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ మీటర్‌ను అమర్చిన తర్వాత ప్రతి ఒక్కరి నుంచి డిమాండ్ చేసి మరీ రూ.200 వసూలు చేస్తుండటంతో విద్యుత్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌పీడీసీఎల్ దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడు తామెందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ప్రైవేట్ ఏజెన్సీల వారితో వాగ్వాదానికి దిగుతున్నారు.
వారు మాత్రం తాము పని చేసినందుకు డబ్బులు ఇవ్వాల్సిందేనని కరాఖండిగా చెబు తూ వసూలు చేస్తున్నారు. ఈవిషయంపై ఖమ్మం సర్కిల్ ఎస్‌ఈ రమేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. డిజిటల్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించామని, వీరు ఉచితంగానే డిజిటల్ మీటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా మీటర్ అమరిస్తే డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలని సూచించారు.
డిజిటల్ దోపిడీ
Published Sun, Feb 26 2017 1:58 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement