శ్రీశైలంలో నేటి నుంచి గరికిపాటి ప్రవచనాలు | garikapati pravachans starts from today in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో నేటి నుంచి గరికిపాటి ప్రవచనాలు

Published Tue, Dec 13 2016 11:04 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలో నేటి నుంచి గరికిపాటి ప్రవచనాలు - Sakshi

శ్రీశైలంలో నేటి నుంచి గరికిపాటి ప్రవచనాలు

శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మహాసహస్రావధాని డాక్టర్‌ గరికిపాటి నరసింహరావుచే 'ఉమాసహస్రంపై ప్రవచనాలను  వినిపిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో  ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం నిర​‍్వహిస్తారన్నారు. ఈ ప్రవచనాలలో కావ్యకంఠ గణపతిముని రచించిన ఉమాదేవి తత్త్వం, ఉమామహాత్యం, జగన్మాత లీలా విశేషాలు తదితర అంశాలను వివరిస్తారని తెలిపారు. భక్తులు, స్థానికులు, దేవస్థానం అధికార సిబ్బంది తదితరులంతా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని అధికారులు కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement