పాండవుల పేర్లు శివ సంబంధమైనవే
పాండవుల పేర్లు శివ సంబంధమైనవే
Published Sun, Oct 16 2016 10:43 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– ప్రవచనవేత్త సామవేదం
శ్రీశైలం: మహాభారతంలోని పంచ పాండవుల పేర్లు అయిన.. భీమా, అర్జున, నకుల సహదేవుల పేర్లన్నీ శివసంబంధమైనవేనని ప్రవచన వేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. శ్రీభ్రరాంబా మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో మహా భారతంలో శివమహిమల గురించి ప్రవచనాలను వినిపించారు. అర్ధనారీశ్వరం, నటరాజ స్వరూపంలో విశ్వ విజ్ఞానానికి సంబంధించిన అంశాలు అంతర్లీనంగా కలిగి ఉన్నాయని షణ్ముఖశర్మ అన్నారు. శతరుద్రీయం విశేషమైనదిగా పేర్కొన్నారు.
Advertisement
Advertisement