pravachan
-
సకల చరాచర సృష్టికి మూలం శివుడే
శ్రీశైలం: సకల చరాచర సృష్టికి మూలం శివుడేనని ప్రముఖ ప్రవాచకులు పద్దిపర్తి పద్మాకర్ తెలిపారు. శనివారం మూడోరోజు జరిగిన దివ్యప్రవచనాల్లో ఆహింస పరమధర్మమని, ఎవరినీ హింసించరాదని తెలిపారు. శివలింగాన్ని పూజిస్తే హింసాపాపం తొలగుతుందని, ఆ పూజ కూడా పంచగవ్యాలతో అభిషేకించిన అనంతరం తడి విభూదిని లేపనం చేసి జలాభిషేకం, బిల్వపత్రాలతో అర్చిస్తే హింసాపాపం తొలగుతుందని తెలిపారు. శివలింగమహిమను విశేషించి వివరిస్తూ నందివర్ధన మహారాజు ఆచరించిన శివార్చనను, శివుడు చెన్నమ్మవ్వప్ప చేసిన సేవను స్వీకరించిన విధానం భక్తుడు శివుడికి చేసిన వాహనసేవ, అతిహృద్యంగా వివరించారు. ఆయోద్యనగర రాజైన మిత్రసహుడు కాశీనగరంలో అగస్తుడు ప్రతిష్టించిన శివలింగాన్ని విస్మరించడం వల్ల నమస్కరించకపోవడంతో కలిగిన దుర్గతిని, తదితర అంశాలను క్షుణ్ణంగా తెలిపారు. కార్యక్రమానికి ముందు ప్రఖ్యాత ప్రవాచకులు డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీశైలంలో నేటి నుంచి గరికిపాటి ప్రవచనాలు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహరావుచే 'ఉమాసహస్రంపై ప్రవచనాలను వినిపిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఈ ప్రవచనాలలో కావ్యకంఠ గణపతిముని రచించిన ఉమాదేవి తత్త్వం, ఉమామహాత్యం, జగన్మాత లీలా విశేషాలు తదితర అంశాలను వివరిస్తారని తెలిపారు. భక్తులు, స్థానికులు, దేవస్థానం అధికార సిబ్బంది తదితరులంతా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని అధికారులు కోరారు. -
పాండవుల పేర్లు శివ సంబంధమైనవే
– ప్రవచనవేత్త సామవేదం శ్రీశైలం: మహాభారతంలోని పంచ పాండవుల పేర్లు అయిన.. భీమా, అర్జున, నకుల సహదేవుల పేర్లన్నీ శివసంబంధమైనవేనని ప్రవచన వేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. శ్రీభ్రరాంబా మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో మహా భారతంలో శివమహిమల గురించి ప్రవచనాలను వినిపించారు. అర్ధనారీశ్వరం, నటరాజ స్వరూపంలో విశ్వ విజ్ఞానానికి సంబంధించిన అంశాలు అంతర్లీనంగా కలిగి ఉన్నాయని షణ్ముఖశర్మ అన్నారు. శతరుద్రీయం విశేషమైనదిగా పేర్కొన్నారు.