
ఘరానా దొంగ అరెస్టు
విశాఖ జిల్లా పెదపల్లి గ్రామానికి చెందిన బొద్దపు బాబూరావు అనే ఘరానా దొంగను సీసీఎస్ పోలీసులు మంగళవారం
విజయనగరం లీగల్ : విశాఖ జిల్లా పెదపల్లి గ్రామానికి చెందిన బొద్దపు బాబూరావు అనే ఘరానా దొంగను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దొంగ వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం సోమవారం రాత్రి స్థానిక మామిడి యార్డు సమీపంలో దొంగను అరెస్ట్ చేసి, ఆయన వద్ద నుంచి 90 గ్రాముల బంగారు, కేజీ వెండి ఆభరణాలు, వీడియో కెమెరాను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
ఇటీవల కాలంలో ఈ దొంగ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో అనేక చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం, ఐ.పోలవరం, ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతనిపై కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. దొంగను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సీఐలు పి.శోభన్‌బాబు, ఈ.నర్సింహమూర్తి, ఎస్సైలు జిఏవి.రమణ, ఐ. సన్యాసిరావు, ఎస్‌ఎస్‌నాయుడు, సిబ్బంది జి.నాగేంద్రప్రసాద్, ఎస్.కిరణ్‌కుమార్, పి.జగన్మోహన్‌లను డీఎస్పీ అభినందించారు.