ఘట్‌కేసర్‌ను జిల్లా కేంద్రంగా గుర్తించాలి | ghatkesar district headquarter | Sakshi

ఘట్‌కేసర్‌ను జిల్లా కేంద్రంగా గుర్తించాలి

Published Thu, Jul 21 2016 4:51 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఘట్‌కేసర్‌ను జిల్లా కేంద్రంగా గుర్తించాలి - Sakshi

ఘట్‌కేసర్‌ను జిల్లా కేంద్రంగా గుర్తించాలి

ఘట్‌కేసర్‌ టౌన్‌: జిల్లా పునర్‌వ్యవస్థకరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా తూర్పు ప్రాంతాన్ని కలుపుకొని ఏర్పడనున్న జిల్లాకు ఘట్‌కేసర్‌ను జిల్లా కేంద్రంగా గుర్తించాలని కోరుతూ.. బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షుడు బిక్కునాయక్, బీజేపీ మండల అధ్యక్షుడు కంభం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రాంతాలను హైదరాబాద్‌లో కలిపితే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని, జిల్లాలో రెండున్నర లక్షల ఓటర్లతో మండలం ప్రథమ స్థానంలో ఉంన్నారు. జాతీయ రహదారి, ఓఆర్‌ఆర్, రహేజా, ఇన్ఫోసిస్‌ తదితర అంతార్జాతీయ వ్యాపార సంస్థలు, భాగ్యనగర నందనవనం, రైల్వే స్టేషన్, ఎంఎంటీఎస్‌ సౌకర్యం మండలంలో ఉందన్నారు. ఢిల్లీకి వెళ్లే ప్రధాన రైలు మార్గం, జాతీయ రహదారి రెండు రకాల రవాణ సౌకర్యం ఉందన్నారు. జిల్లా ఏర్పాటుకు అన్ని రకాల సదుపాయాలున్నందున జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు ఎదుగని శ్రీరాములు, అచ్చిని రమేష్, మాజీ అధ్యక్షుడు పత్తెపు పాండురాజు, గిరిజన మోర్చ మండల అధ్యక్షుడు తౌర్యనాయక్, మేడబోయిన బాల్‌రాజు, గాజుల కృష్ణయాదవ్, రామ్‌రతన్‌శర్మ, చంద్రశేఖర్, రాణి, రజనీ, వాసవి, ఆంజనేయులు, భిక్షపతి, షానూర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement