
అల్లం వినాయకుడు
దోమకొండ: నిజామాబాద్ జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన గృహిణి అందె లలిత శనివారం అల్లం కొనుగోలు చేయగా, వినాయకుడి ఆకారంలో కనిపించింది. పూర్తిగా వినాయకుడి రూపం పోలి ఉండగా, దానిని అలాగే ఉంచారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు వినాయకుడి రూపంలో ఉన్న అల్లాన్ని చూసేందుకు తరలివచ్చారు. గణపతి రూపం కావడంతో దండాలు పెట్టారు.