ఫుట్‌బాల్‌ జాతీయ జట్టుకు బాలికల ఎంపిక | girls elect to foot ball national team | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ జాతీయ జట్టుకు బాలికల ఎంపిక

Published Sat, Oct 1 2016 11:31 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఫుట్‌బాల్‌ జాతీయ జట్టుకు బాలికల ఎంపిక - Sakshi

ఫుట్‌బాల్‌ జాతీయ జట్టుకు బాలికల ఎంపిక

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఫుట్‌బాల్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యారని ఏపీ స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. తద్వారా జిల్లా కీర్తిని ఇనుమడింపజేసిన ఆ క్రీడాకారులను శనివారం స్థానిక కొత్తూరు బాలుర పాఠశాలలో అభినందించారు. గత నెల 28–30 వరకు తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన వీరు సెలెక్టర్ల మన్ననలు పొంది జాతీయ జట్టుకు ఎంపికయ్యారన్నారు.

అక్కడ కూడా ఇలాగే ప్రతిభ కనబరచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయి క్రీడాపోటీలు బాలికలకు తెలంగాణ  రాష్ట్రంలోని మెదక్‌లోను, బాలురకు జమ్మూకాశ్మీర్‌లోనూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ విజయ, కోచ్‌ రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.
............
జాతీయ జట్టుకు ఎంపికైన బాలికలు
లక్ష్మీ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆత్మకూరు.
లావణ్య, మహాత్మ జూనియర్‌ కళాశాల, ఉరవకొండ.
వరలక్ష్మీ, హేమావతి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఉరవకొండ.
మల్లిక, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కళ్యాణదుర్గం
..............
జాతీయ జట్టుకు ఎంపికైన బాలురు
రహమాన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement