విభిన్నం.. అమ్మవారి దర్శనం
విభిన్నం.. అమ్మవారి దర్శనం
Published Wed, Jul 20 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
సాలూరు రూరల్ (పాచిపెంట) : చీపురువలస గ్రామ సమీపంలో కొండపై పురాతన పారమ్మ తల్లి ఆలయానికి విశిష్టత ఉంది. ఈ కొండపై పార్వతీదేవి విగ్రహాన్ని సుమారు 2400 ఏళ్ల క్రితం ప్రతిష్టించి ఉంటారని పురావస్తు శాఖ నిర్థారించినట్టు స్థానికుల కథనం. ఈ కొండ ప్రారంభంలో వినాయక గుడిలో పూజలు చేశాక భక్తులు పైకి వెళ్తారు. మార్గమధ్యంలో పాండవుల గుహ ఉంది. కొండ చివరన ఉన్న అమ్మవారు 36 చేతులు, శిరస్సుపై శివుడితో ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. అమ్మవారు వివిధ సమయాల్లో వివిధ రూపాల్లో కనిపిస్తుందని.. ఉగ్ర రూపంలో కనిపిస్తే గ్రామానికి చేటు జరుగుతుందని భక్తుల నమ్మకం. గతంలో ఈ కొండపై ఓ యాదవుడు ఎక్కుతూ జారిపడినప్పుడు అతని చేతిలోని పాలు ధారలు పడిపోయాయని, అవే వర్షాలు కురిసినప్పుడు మూడు ధారలుగా కొండపై నుంచి ప్రవహిస్తుందంటారు. ముఖ్యమైన పర్వదినాలు, మహాశివరాత్రి రోజు ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఈ రోజుల్లో ఆంధ్ర, ఒడిశా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శిఖరం చివర్లో ఏర్పాటుచేసే అఖండ జ్యోతి కొన్ని రోజుల పాటు అలాగే వెలుగుతుంటుంది.
Advertisement