Ancient temple
-
Sambhal: సొంత ఇళ్లను కూలగొట్టుకుంటున్న మైనారిటీలు
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇటీవల పురాతన శివాలయం బయటపడింది. ఈ వార్త సంచలనంగా మారడంతో ఈ పురాతన ఆలయం చుట్టుపక్కలగల మైనారిటీ వర్గాల వారు తమ ఇళ్లను కూల్చివేసుకుంటున్నారు.పురాతన శివాలయం ఆనవాళ్లు వెలుగు చూసిన దరిమిలా జిల్లా యంత్రాంగం ఆ చుట్టుపక్కల గల ఆక్రమణను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. ఇంతలోనే అప్రమత్తమైన స్థానిక మైనారిటీ వర్గాలవారు తమ ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. ఆక్రమణల పేరుతో జిల్లా అధికారులు తమ ఇళ్లను కూల్చివేసేలోగానే, ఇంటిలోని విలువైన వస్తువులను మరో చోటుకు తరలించి, తమ ఇళ్లను మైనారిటీ వర్గాలవారు కూల్చివేసుకుంటున్నారు.ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ సంభాల్‌లో విద్యుత్ చౌర్యానికి పాల్పడున్న వారిపై దాడులకు ఉపక్రమించింది. ఇటీవలే అక్రమ నిర్మాణం ఆరోపణలపై నోటీసు అందుకున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ ఇంటిపై విద్యుత్ అధికారులు దాడులు చేశారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఇళ్లలో జరుగుతున్న విద్యుత్ చౌర్యాన్ని గుర్తించి రూ.1.3 కోట్ల జరిమానా విధించారు. విద్యుత్ అధికారుల దాడుల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.నవంబర్‌లో సంభాల్‌లోని జుమా మసీదు వద్ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే నిర్వహించిన సమయంలో జరిగిన హింస, కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. 20 మందికి పైగా జనం గాయపడ్డారు. మొఘల్ పాలనలో హిందూ దేవాలయ అవశేషాలపై మసీదు నిర్మించారనే వాదనల నేపధ్యంలో ఏఎన్ఐ సర్వే జరిగింది. అయితే ఇంతలో జిల్లా అధికారులు మసీదుకు కిలోమీటరు దూరంలో ఒక పురాతన ఆలయ ఆనవాళ్లను కనుగొన్నారు. అక్కడ కొన్ని విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి. దీంతో 1978 అల్లర్ల తర్వాత మూతపడిన ఈ ఆలయాన్ని అధికారులు తెరిచాయి. కాగా ఆలయ ప్రాచీనతను నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ చేసే బాధ్యతను సంబంధిత అధికారులు ఏఎస్ఐకి అప్పగించారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
Archaeological Survey Of India: జ్ఞానవాపి మసీదులో దేవతా విగ్రహాలు
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద పురాతన హిందూ ఆలయ అవశేషాలున్నాయంటూ కోర్టుకు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సమర్పించిన సర్వే నివేదికలో మరి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. శివలింగం భాగాలు, హిందూ దేవతల ధ్వంసమైన విగ్రహాలు మసీదులో ఉన్నాయి. వాటి ఫొటోలు తాజాగా జాతీయ మీడియాకు లభించాయి. హనుమాన్, గణేష, నంది విగ్రహాల ఫొటోలు, కొన్ని పానవట్టాలు, కిందిభాగం లేని శివలింగం వాటిలో ఉన్నాయి. శతాబ్దాల నాటి నాణేలు, పర్షియన్ లిపి సున్నపురాయి శాసనం, రోలు ఉన్నాయి. మసీదు కింద భారీ ఆలయముండేదని నివేదిక నిరూపిస్తోందని హిందువుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. ఆలయ రాతిస్తంభాలనే కాస్త మార్చి మసీదు నిర్మాణంలో వాడారని నివేదికలో ఉందన్నారు. ‘‘17వ శతాబ్దంలో ఔరంగజేబు ఇక్కడి ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని కూల్చేసినట్లు నివేదికలోని ఆధారాలు బలంగా చాటుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ ఒక ఆలయం ఉండేదని స్పష్టమవుతోంది’’ అని ఆయన చెప్పారు. దీనితో అంజుమన్ అంజామియా మసీదు కమిటీ ప్రతినిధి అఖ్లాఖ్ అహ్మద్ విభేదించారు. ‘‘ఇందులో కొత్తేమీ లేదు. గతంలోనూ అవి ఉన్నాయని ఏఎస్ఐ తెలిపింది. తాజా నివేదికలో వాటి కొలతలను స్పష్టంగా పేర్కొంది. అవి పురాతనమైనవని చెప్పే ఆధారాలను ఏఎస్ఐ ప్రస్తావించలేదు. ఆ రాళ్ల వయసు ఎంత అనే అంశాలపై ఏఎస్ఐ ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. సర్వేలో ఉన్నవన్నీ ఏఎస్ఐ అభిప్రాయాలు మాత్రమే. అవి నిపుణుల అభిప్రాయాలు కాదు’’ అని ఆయన వాదించారు. గత ఏడాది జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ మసీదు కాంప్లెక్స్‌లో శాస్త్రీయసర్వే చేపట్టి గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన సీల్డ్ కవర్లో సర్వే నివేదికను సమర్పించింది. తాజాగా కోర్టు వాటిని కేసులో భాగమైన ఇరుపక్షాల ప్రతినిధులు, న్యాయవాదులకు అందజేశారు. దీంతో నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. -
దేశంలోనే అత్యంత పురాతన దేవాలయం!
ఇది మన దేశంలోనే అత్యంత పురాతన దేవాలయం. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ గ్రామంలో సోన్ నదీ తీరానికి చేరువలో పౌంరా పహాడ్ కొండ మీద కొలువై ఉన్న ఈ దేవాలయం క్రీస్తుశకం 108 సంవత్సరం నాటిది. ఇది శాక్తేయ ఆలయం. ఇందులో కొలువై ఉన్న దుర్గాదేవిని ముండేశ్వరీదేవిగా పిలుస్తారు. అందువల్ల ఈ ఆలయం ముండేశ్వరీ ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఇదే ఆలయంలో శివుడు మండలేశ్వరుడిగా కొలువై పూజలందుకుంటున్నాడు. అసలు ఇక్కడి ముండేశ్వరి మొదటి పేరు మండలేశ్వరి అని, ముండుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల ముండేశ్వరి అనే పేరువచ్చిందని చెబుతారు. ఈ పురాతన ఆలయాన్ని 1915 సంవత్సరం నుంచి భారత పురాతత్త్వ శాఖ పరిరక్షిస్తూ వస్తోంది. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. (చదవండి: ఓ మహిళ 'మానవ పిల్లి'లా..అందుకోసం ఏకంగా శరీరాన్ని 20కి పైగా మార్పులు..) -
Chilkur: చిలుకూరులో 1000 ఏళ్ల నాటి శివాలయం..
సాక్షి, హైదరాబాద్: చిలుకూరు అనగానే అందరికీ బాలాజీ దేవాలయం గుర్తుకొస్తుంది. హైదరాబాద్ నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అమెరికా వెళ్లాలనుకునే యువత ప్రదక్షిణలతో నిత్యం ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. వీసా బాలాజీ అంటూ వారు పిలుచుకుంటుంటారు. చిలుకూరు బాలాజీ దేవాలయం చేరువలోనే మరో అత్యంత పురాతన శివాలయం ఉందని, ఈ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూటుల కాలం నాటిదని తాజాగా చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. స్థానికులు దానికి సున్నం వేసి పూజాదికాలు నిర్వహిస్తున్నప్పటికీ, అది బాగా శిథిలావస్థకు చేరుకుంది. తాజాగా శివనాగిరెడ్డి ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ’కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని చారిత్రక ఆనవాళ్లపై పరిశోధించారు. ఈ సందర్భంగా ఈ శివాలయాన్ని పరిశీలించి, నిర్మాణ శైలి, అందులోని విగ్రహాల శైలి ఆధారంగా అది వెయ్యేళ్ల క్రితంనాటిదని తేల్చారు. ఆలయ అధిష్టానం ఇప్పటికే భూమిలోకి కూరుకుపోయిందని, ఆలయ రాళ్ల మధ్య పగుళ్లేర్పడి విచ్చుకుపోతున్నాయని, శిఖరభాగంలోని రాళ్లు దొర్లిపోతున్నాయని పేర్కొన్నారు. 9–10 శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. జైన బసదిగా విలసిల్లిన గ్రామం వేములవాడ చాళుక్యుల కాలంలో ఈ గ్రామం జైన బసదిగా విలసిల్లిందని, ఇక్కడ అద్భుత జైన నిర్మాణాలుండేవని, ఇక్కడి కొన్ని శిల్పాలు ప్రస్తుతం గోల్కొండలోని ఖజానా బిల్డింగ్ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయని, ఇప్పటికీ గ్రామంలోని చాలా ప్రాంతాల్లో జైన శిల్పాలు కనిపిస్తున్నాయని శివనాగిరెడ్డి చెప్పారు. రాష్ట్రకూటుల శైలి శివాలయం పక్కన కూడా జైన శిల్పముందన్నారు. గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న భైరవ, వీరుల, నాగదేవత, భక్తురాలి శిల్పాలను సరిగ్గా ప్రతిష్టించాలని, చెరువుకట్ట వద్ద ఉన్న పురాతన మండపాన్ని కూడా పునరుద్ధరించాలని సూచించారు. చదవండి: మినరల్ వాటర్.. మిల్లెట్ భోజనం! -
భువనగిరిలో వెలుగుచూసిన దాన శాసనం
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గాందీనగర్‌లో అభివృద్ధి పనుల కోసం శనివారం చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన పురాతన ఆలయ ఆనవాళ్లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఆలయాన్ని శ్రీ వీరభద్రేశ్వర క్షేత్రంగా, తెలుగు శాసనాన్ని దాన శాసనంగా గుర్తించింది. దాన శాసనంపై చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆదివారం వెల్లడించిన వివరాలివి. ఆచంద్రార్కం.. అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం శ్రీవీరభద్రేశ్వర దేవరకు, గర్భగుడిలో నిర్వహించే పూజాదికాలు, ఇతర సేవల నిర్వహణకు వ్యాపారులు విక్రయించే సరుకులపై సుంకం వసూలు చేయాలని నిర్ణయించారు. దేవుని ధూపదీప నైవేద్యాలకు నిత్యం సోలెడు గానుగ నూనె ఉచితంగా ఇవ్వాలని భువనగిరికి చెందిన అష్టాదశ ప్రజలు (పద్దెనిమిది కులాలు) నిర్ణయించారు. భువనగిరి ప్రజలకు పుణ్యం కలిగేందుకు సుంకం ఇవ్వడానికి వ్యాపారులు, ఉచితంగా నూనె ఇవ్వడానికి అష్టాదశ ప్రజలు ముందుకొచ్చారు. దీనికోసం ఏర్పాటు చేసిందే దాన శాసనమని హరగోపాల్ వివరించారు. మహామండలేశ్వరుడైన కాకతీయ ప్రతాపరుద్ర దేవ మహారాజు పరిపాలనా కాలం శక సంవత్సరం 1240 కాళయుక్తి సంవత్సరం ఆషాడ శుద్ధ 15 పౌర్ణమి గురువారం (క్రీ.శ 1318 జూన్ 14న) దాన శాసనం వేసినట్లు హరగోపాల్ తెలిపారు. -
ఖమ్మం జిల్లాలో వెయ్యేళ్లనాటి శివాలయం-అతిపెద్ద శివలింగం
కూసుమంచి (ఖమ్మం): కాకతీయుల భక్తిభావం, కళావైభవానికి ప్రత్యక్షసాక్ష్యం కూసుమంచిలోని శివాలయం. ఈశివాలయాన్నే గణపేశ్వరాలయంగా, రామలింగేశ్వరస్వామి ఆలయంగా కూడా పిలుస్తున్నారు. క్రీ.శ 11–12వ శతాబ్ధంలో కాకతీయుల కాలంలో వెయ్యిన్నొక్కటి శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా ప్రసిద్ది చెందింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉత్తర దిశగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని పెద్దపెద్ద బండరాళ్లతో పేర్చిన ఘనత ఆ శిల్పికే దక్కింది. (చదవండి: అపార్ట్మెంట్లో బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్) శివాలయంలోని శివలింగం ఆలయాన్ని పైగుండా చూస్తే నక్షత్రాకారంలో, మరోవైపు శివలింగాకారం ఉన్నట్లుగా బండరాళ్లను పేర్చి వాటిపై ఆలయాన్ని నిర్మించటం విశేషం. ఇక ఆలయంలో ఉన్న శివలింగం 6 అడుగుల ఎత్తు. 5.3 సెంమీ వ్యాసార్థంతో ప్రతిష్టించగా అది నున్నటి గ్రానైట్ రాయిని పోలి ఉంటుంది. శివలింగంపై ప్రతినిత్యం సూర్యోదయ సమయాన సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని నిర్మించటం మరో విశేషం. వందలాది సంవత్సరాల పాటు కంపచెట్లు, మట్టిదిబ్బలతో జీర్ణావస్థకు చేరింది. గ్రామంలో గొప్ప ఆలయం ఉన్నా దాన్ని ఎవరూ పట్టించుకోక పోవటంతో అది ఎలా ఉందో కూడా గ్రామస్తులకు తెలియని పరిస్థితి. నాటి కూసుమంచి సీఐగా ఉన్న సాథు వీరప్రతాప్‌రెడ్డి దృష్టికి ఆలయం విషయం రావటంతో గ్రామస్థుల సహకారంతో ఈఆలయాన్ని వెలుగులోకి తీసుకవచ్చారు. దాన్ని అభివృద్ది పరిచి పూజలు ప్రారంభింపజేశారు. భక్తుల చొరవతో ఈ ఆలయం క్రమంగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత మహా ఆలయంగా వెలుగొందుతోంది. ఈ ఆలయాన్ని దర్శించటం పునర్జన్మ సుకృతంగా పెద్దలు అభివర్ణిస్తున్నారు. కూసుమంచి శివాలయాన్ని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈశివాలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతూ.. నానాటికి దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతి శివరాత్రికి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఉమ్మడి నల్లగొండ, వరంగల్ నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతియేడు వేల మంది భక్తులు ఈ శివాలయాన్ని దర్శించుకుంటున్నారు. (చదవండి: జంగు ప్రహ్లాద్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం..) -
Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!
ఎన్నో అద్భుత, మర్మగర్భ దేవాలయాలకు మన దేశం పెట్టిందిపేరు. వాటిల్లో యోగిని దేవాలయాలు కూడా చెప్పుకోదగ్గవే. మన దేశంలో మొత్తం 64 యోగిని దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో రెండు దేవాలయాలు ఒడిస్సాలో, రెండు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని మితావాలి గ్రామంలో ఉన్న 64 యోగిని దేవాలయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇది గుండ్రని ఆకారంలో, 64 గదుల్తో ఉంటుంది. ప్రతి గదిలో ఒక్కో శివలింగం, యోగిని దేవత విగ్రహం ఉంటాయి. అందువల్లే ఈ దేవాలయానికి 64 యోగిని దేవాలయం అనేపేరు వచ్చింది. ఐతే వీటిల్లో కొన్ని విగ్రహాలు దొంగిలించబడ్డాయి. మిగిలినవాటిని ఢిల్లీ మ్యూజియంలో భద్రపరిచారు. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. సుమారు వెయ్యి అడుగుల ఎత్తులో కొండపైన వృత్తాకారంలో ఉంటుంది ఈ దేవాలయం. చూపరులకు పళ్లెం ఆకారంలో కనిపిస్తుంది. ఈ ఆలయం మధ్యలో బహిరంగ మంటపం నిర్మించబడి ఉంటుంది. భారత పార్లమెంట్‌ను నిర్మించిన బ్రిటీష్ ఆర్కిటెక్చర్ సర్ ఎడ్విన్ లుటియెన్స్ ఈ 64 యోగిని దేవాలయం ఆధారంగానే నిర్మించాడని నానుడి. పార్లమెంటు స్తంభాలు కూడా ఇక్కడి స్తంభాలమాదిరిగానే ఉంటాయి. చదవండి: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. తాబేలు రాజు దేవ్‌పాల్ 1323లో ఈ దేవాలయాన్నినిర్మించాడు. ఇక్కడ జ్యోతిష్యం, గణితం బోధించేవారట. తంత్ర మంత్రాలు నేర్చుకునేందుకు ప్రజలు ఈ శివాలయానికి తరలివచ్చేవారట. ఈ దేవాలయం ఇప్పటికీ శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడివుందని అక్కడి స్థానికుల నమ్మకం. అందుకే రాత్రి వేళ ఈ ఆలయంలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. కాళీమాత 64వ అవతారమే యోగిని అని, ఘోర అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు ఈ అవతారాన్ని ధరించిందనే నమ్మకం ప్రచారంలో ఉంది. ఇంకా ఎన్నో అంతుచిక్కని మర్మగర్భిత రహస్యాలు ఈ 64 యోగిని దేవాలయంలో దాగివున్నాయి. చదవండి: 'నీ అఫైర్ గురించి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు.. చూశావా?’ -
ఆమెకు 20 చేతులు ఐదు తలలు..!
సాక్షి, మంచిర్యాల: తెలంగాణ కొత్త చరిత్ర పరిశోధన బృందం ఇన్నాళ్లు మరుగున పడిన చరిత్రను వెలుగులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కేంద్రంలో పురాతన ఆలయ గొప్పతనాన్ని గుర్తించారు. చాళుక్యుల (6–12శతాబ్దం) కాలం నాటి అద్బుతమైన ప్రాచీన దేవాలయ విశిష్టతను తెలియ జేస్తున్నారు. ఇక్కడి విగ్రహాలు ఎంతో ప్రత్యేకతను కనబరుస్తున్నాయి. ఆలయం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వాంకిడిలోని గుడిలో కొలువై ఉన్న ప్రధాన దేవత మహా మాత ఎల్లమ్మ. ఈ దేవతా శిల్పాన్ని పరిశీలిస్తే... ఉమాలింగనమూర్తి శిల్పంలో ఉన్నట్టే సుఖాసనంలో కూర్చుని ఉంది. ఆమెకు 20 చేతులున్నాయి. తల మీద తల ఐదు తలలున్నాయి. (చదవండి: పాపం చిట్టితల్లి.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ వస్తేనే వైద్యం) ఆలయంలోని పూరతన విగ్రహాలు ఇద్దరికి కింద వాహనంగా రెండు చేతులు, కాళ్లు నేల మీద మోపి వంగి వున్న రాక్షసుడున్నాడు. ఈ గుడిలో సప్తాశ్వరథారుఢుడైన ఆదిత్య శిల్పం మనోహరం, సర్వాంగ సుందరంగా తోరణాదులతో హళేబీడు శిల్ప శైలిలో ఉంది. ఖజురహోలోని సూర్య శిల్పాన్ని పోలి వుంది. గర్బగుడి ద్వారం చాళుక్య పూర్వ శైలిలో కవాట పద్దతిలో కడప, శేరెల మీద స్తంభోప స్తంభాలున్నాయి. ఉత్తరాశి మీద ప్రస్తరం ఉంది. లలాటబింబంగా గణపతి ఉన్నాడు. గర్బగుడిలో క్షితిజసమాంతరంగా ఉన్న వర్తులాకార పానపట్టంలో సమతల శివలింగం ప్రతిష్టించబడి ఉంది. ఇది చాళుక్య శైలి లింగం. ఈ దేవాలయం కాలాముఖ శైవులది. ఇక్కడ శాక్తేయమతం కూడా ఉందని శిల్పాల వల్ల తెలుస్తున్నది. ఇటువంటి శిల్పాలున్న దేవాలయం తెలంగాణలోనే చాలా అరుదు. మధ్య భారత దేవాలయ వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించిన గుడి ఇది. ఈ వివరాలన్నీ యువ పరిశోధకుడు సముద్రాల సునీల్ వెలుగులోనికి తెచ్చాడు. (చదవండి: మీకు తెలుసా? పోలింగ్ సమయంలో ‘సెక్షన్ 49పీ’ అంటే ఏంటో) ఆలయ అభిముఖం గుడిలోని విడి శిల్పాలు... లోహకారుల దేవత మహామాయ ( శిల్పం మీద పేరు చెక్కి ఉంది ) శాంకరి, చాముండ ఉమాలింగనమూర్తి (ఈ శిల్పం మీద దేవాలయ నిర్మాత రాజు ప్రతిమ ఉంది). లక్ష్మీ నారాయణ స్వామి, అనంతశయనుడు, గరుత్మంతుడు, త్రై పురుష మూర్తి, విష్ణువు, పాశుపతయోగులు, భైరవులు, వీర భద్రులు, గణపతి ప్రతిమలున్నాయి. ఇందులో కొన్ని చాళుక్య శైలి శిల్పాలు, గుడి బయట వీరగల్లులున్నాయి. ఆలయంలోని పూరతన విగ్రహాలు గుడి జగతి మీద శిల్పాలు... వాంకిడి శివాలయం ఎత్తైన జగతి మీద నిర్మితమైంది. జగతి మీద గజధార, అశ్వధారలతో పాటు కొన్ని పౌరాణిక కథా దృశ్యాలు చెక్కి ఉన్నాయి. వాటిలో అశ్వ, గజసైన్యాలు, గజాల యుద్ద దృశ్యాలున్నాయి. పాశుపతయోగుల శిల్పాలున్నాయి. గోపికా వస్త్రాపహరణం, అశ్వమేథాశ్వం కొరకు వచ్చిన రామ సోదరులతో లవకుశులు యుద్ద దృశ్యం, పాండవులు, పెండ్లి, మంగళస్నానాలు, చతుష్పాద నటత్రయం (రామప్ప పూర్వ శిల్పం ), నాట్య కత్తె, సింహవ్యాళి, ఒక చోట ఇద్దరు పరిచారికల చేత సేవింపబడుతున్న శైవ గురువు సుఖాసనంలో కూర్చుని వున్నాడు. చివరలో ఇద్దరు అప్సరలు చేతులు పట్టుకొని కొనిపోతున్న వీరుడున్నాడు. ఇదొక ఆత్మాహుతి వీరగల్లు దృశ్యం. (చదవండి: తోబుట్టువులతో మేటర్ చెప్పిన యువతి.. ప్రియుడు మాట దాటవేస్తుండటంతో..) -
42 ఏళ్ల క్రితం చెన్నైలో చోరీ.. లండన్‌లో దొరికాయి!
చెన్నై: 42 సంవత్సరాల క్రితం దొంగిలించబడిన మూడు విగ్రహాలు తిరిగి ఆలయానికి చేరాయి. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని నాగపట్నం జిల్లా అనంతమంగళంలో ఉన్న పురాతన రాజగోపాల స్వామి ఆలయంలో 42 సంవత్సరాల క్రితం దొంగిలించబడిన మూడు విగ్రహాలు తిరిగి ఆలయానికి చేరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లండన్‌లో స్వాధీనం చేసుకున్న ఈ విగ్రహాలు చెన్నై నుంచి శనివారం ఆలయానికి చేరుకున్నాయి. 1978లో, 15 వ శతాబ్దపు ఈ ఆలయానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, హనుమంతుడి విగ్రహాలు దొంగిలించబడ్డాయి. ఆ రోజుల్లో పోరయార్ పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే విగ్రహాలను గుర్తించలేకపోయారు. (శశికళ ఆశలు అడియాశలు..!) కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో కళాఖండాల వ్యాపారాన్ని పర్యవేక్షించే సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన సమాచారం మేరకు దొంగిలించబడిన నాలుగు విగ్రహాలలో మూడు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లండన్‌లోని ఒక పురాతన వస్తువులను సేకరించే వ్యక్తి వద్ద నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా... శుక్రవారం ముఖ్యమంత్రి పళనిస్వామి చెన్నైలోని విగ్రహాలను పరిశీలించి.. వాటిని అధికారికంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి శంకరేశ్వరికి అప్పగించారు. (50 అడుగుల బావిలో గున్న ఏనుగు) -
పొలంలో పురాతన ఆలయం
బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): వ్యవసాయ పనులుచేస్తుండగా చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం శీలంవారిపల్లె సమీపంలోని కోనాపురం వద్ద పురాతన ఆలయం బయల్పడింది. శిధిలమై పూడిపోయిన ఆలయ శిథిలాలతో పాటు లక్ష్మీదేవి పాలరాతి విగ్రహం లభించాయి. శీలంవారిపల్లె నుంచి కనికలతోపుకు వెళ్లే రోడ్డు పక్కన కోనాపురం అని పిలుచుకునే ప్రాంతంలో 25ఏళ్ల క్రితం అరవ చిన్నప్పకు 81 సెంట్ల భూమికి డీకేటీ పట్టా మంజూరు చేశారు. సోమవారం అతని కుమారులు జేసీబీతో పొలాన్ని లోతుగా చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి వాడే రాళ్లు భూమిలోంచి తీసేకొద్ది వస్తుండగా వాటిని పొలంలోనే కుప్పగా పోశారు. వాటిలో లక్ష్మీదేవి విగ్రహం కనిపించింది. గ్రామస్తులు విగ్రహాన్ని శుద్ధిచేసి పూజలు చేశారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్ఐ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కోనేటిరాయ ఆలయం విరాజిల్లింది కోనాపురం ప్రాంతంలో కోనేటిరాయస్వామి ఆలయం విరాజిల్లినట్టు తెలుస్తోంది. అక్కడ ఆలయానికి సంబంధించిన స్తంభాలు, విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం లేదా పాలెగాళ్ల పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఆలయం వద్దనుంచే అనంతపురం జిల్లాలోని పెనుగొండ నుంచి గుర్రంకొండకు రహదారి ఉండేదని పూర్వీకులు చెప్పేవారని స్థానిక వృద్ధులు తెలిపారు. కోనేటిరాయస్వామి ఆలయం తురుష్కుల దాడుల్లో ధ్వంసం అయివుండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆ శిధిలాలే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయంటున్నారు. కోనేటిరాయ ఆలయం శి«థిలమయ్యాక కొన్ని విలువైన విగ్రహాలు, ధ్వజస్తంభాన్ని పలు ఆలయాలకు తరలించినట్లు తమ పూర్వీకులు చెప్పేవారని శీలంవారిపల్లె మాజీ సర్పంచు శీలం వేణుగోపాల్‌రెడ్డి విలేకరులకు వివరించారు. -
జలధీశ్వరా పాహిమామ్
శివరాత్రి స్పెషల్ – 1 జలధీశ్వర ఆలయం. రెండవ శతాబ్దికి చెందిన అతి పురాతన దేవాలయం. శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవాలయాలకు విభిన్నంగా ఏకపీఠం మీద శివపార్వతులు దర్శనమిచ్చే అరుదైన దేవాలయం. శివరాత్రి సందర్భంగా ఘంటసాల గ్రామంలో కొలువుతీరిన జలధీశ్వరాలయంపై ప్రత్యేక వ్యాసం. విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే దారిలో కొడాలికి ఎడమవైపున అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘంటసాల గ్రామంలోని శ్రీబాలపరమేశ్వరీ సమేత జలధీశ్వరాలయం ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి. విజయవాడకు 60 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేవాలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చి భగవంతుని దర్శించుకుంటారు. త్రికాల సంధ్యాస్నానాలకు అనువుగా సముద్ర తీరంలోని ఈ గ్రామంలో బాలపార్వతీ సమేతంగా జలధీశ్వరునిగా కొలువై ఉన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలను, అష్టాదశ శక్తిపీఠాలను దర్శిస్తే వచ్చే పుణ్యమే ఈ దేవాలయ సందర్శన వల్ల కూడా కలుగుతుందని స్థలపురాణం చెబుతోంది. జలధీశ్వర అభిషేక జలం సేవిస్తే అనేక వ్యాధులు నయమవుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. శివుని కోరిక మేరకు... ఏకపీఠే విరాజన్తం సర్వమంగళాయా సహా ఘంటశాల పురాధీశం జలధీశ్వర ముపాస్మహే భస్మాలంకృత సర్వాంగం అగస్త్యేన ప్రతిష్ఠితం భక్తాభీష్ట ప్రదం వందే అద్వైత జ్ఞాన సిద్ధయే‘‘ పూర్వం శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి సృష్టిలోని సకల జీవకోటి భక్తితో ఉత్తరాపథానికి తరలి వెళ్లింది. జీవకోటి భారంతో ఉత్తరాపథం కృంగిపోసాగింది. అప్పుడు పరమేశ్వరుడు అగస్త్య మహర్షిని పిలిచి సృష్టి సమతుల్యం కావడం కోసం తక్షణమే దక్షిణాపథానికి వెళ్లి, పవిత్రప్రదేశంలో శివపార్వతుల విగ్రహప్రతిష్ఠ జరిపి ఏకాగ్రతతో పూజలు జరిపితే తమ కల్యాణ మహోత్సవ సందర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పాడు. దాంతో అగస్త్యుడు దక్షిణాపథానికి వచ్చి ఘంటసాల గ్రామంలో ఏకపీఠంపైన శివపార్వతులను ప్రతిష్ఠించాడని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. జలధి ఒడ్డున ఉన్న శివుడు ఘంటసాల గ్రామానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందిన గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టాలెమీ ఈ గ్రామాన్ని ‘కంటకస్సిల’ అని పేర్కొన్నాడు. సిద్ధార్థుని గుర్రమైన కంటకం పేరు మీద ఈ గ్రామానికి కంటకశైలమనీ, తరువాత కంటకశిల అనీ రానురాను ఘంటసాలగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకారంభంలో ఇదొక రేవు పట్టణంగా ఉండేదనీ, ఇక్కడ వర్తక వాణిజ్యాలు సాగించిన మహా నావికులున్నారనీ, క్రీ.శ. 3వ శతాబ్దంలో ఉపాసిక బోధిసిరి ఇక్కడొక శిలామండపాన్ని కట్టించిందని శాసనాలు తెలియచేస్తున్నాయి. ఈ గ్రామంలో శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి నాణాలు, రోమన్ నాణాలు, శాలంకాయనుల నాణాలు లభించాయి. ఇక ఈ గ్రామంలోనే ఉన్న జలధీశ్వర ఆలయానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. చాళుక్యులు, శాతవాహనులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇది అతి పురాతన ఆలయాలలో నాలుగవదని పురావస్తు శాస్త్రకారులు చెబుతున్నారు. గుడిమల్లం, అమరావతి, దాక్షారామం... ఆలయాలలోని శివలింగాన్ని పోలి ఉంటుంది ఇక్కడి శివలింగం. అప్పట్లో వ్యాపార నిమిత్తం సముద్రంలో (జలధిలో) పడవలలో ప్రయాణించిన వర్తకులు, మత్స్యకారులు, నావికులు ఇక్కడి శివుడిని అర్చించడం వల్ల ఈయనకు జలధీశ్వరుడని పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి శివుడు శివలింగం ఆకారంలో పార్వతీ సమేతుడై ఏక పానవట్టం మీద దర్శనమిస్తాడు. ఇది చాలా అరుదైన దృశ్యం. ఏక పీఠం మీద శివపార్వతులు ఉన్న ఏకైక దేవాలయం ఇదే అని చెప్పవచ్చు. సాధారణంగా గర్భగుడికి ఎదురుగా నంది దర్శనమిస్తాడు. ఇక్కడ మాత్రం పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా ఇద్దరినీ సమదృష్టితో చూస్తూ కనువిందు చేస్తాడు నందీశ్వరుడు. ఆలయంలో పూజలు ప్రతిరోజూ ఉదయం 6 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు, సాయంత్రం 5 గం. నుంచి రాత్రి 8 గం. వరకు. ఏటా జరిగే ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలు ప్రతినెలా మాస శివరాత్రి సందర్భంగా నమకం, చమకం, శ్రీసూక్తంతో రుద్రాభిషేకాలు మాఘ పూర్ణిమ సందర్భంగా స్వామివారి కళ్యాణం దేవీ నవరాత్రులు, కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు విశేష పూజలు ఏటా డిసెంబర్లో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు. మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు నాటి కంటక శాలే.. నేటి ఘంటశాల శాతవాహనుల కాలంలో ఇది బౌద్ధస్థావరంగా ఉన్నట్లు తవ్వకాల్లో తెలిసింది. ఇక్ష్వాకుల కాలంలో ఈ ప్రాంతాన్ని జీర్ణోద్ధరణ చేశారు. సిద్ధార్ధుడు ఇల్లు విడిచి వెళ్లినప్పుడు ఒక గుర్రం మీద వెళ్లాడట. ఆ గుర్రం పేరు కంటక. ఆ గుర్రం పేరు, కొండను పోలిన స్థూపం పేరు కలిపి కంటకశాల అయిందని, రానురాను ఘంటసాల అయ్యిందని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతం అప్పట్లో వర్తక స్థావరంగా కూడా వెలిసింది. నహపాలుడు శకవంశానికి చెందినవాడు. దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రమే శకనాణాలు దొరికాయి. 11వ శతాబ్దం వరకు ఈ ప్రాంతానికి చోళపాండ్యపురం అని పేరు. జలధిని ఈశ్వరునిగా భావించి, జలధీశ్వరస్వామిని ప్రతిష్ఠించి శివాలయాన్ని నిర్మించారు. మొదటి వేయిసంవత్సరాలు ఇక్కడ బౌద్ధం విరాజిల్లింది. తరువాత నుంచి జలధీశ్వరస్వామితో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. జలధీశ్వరస్వామి శివలింగంలో ఒక ప్రత్యేకత ఉంది. పలనాటి సున్నపు రాతితో ఈలింగాన్ని రూపొందించారని స్థానికులు చెబుతారు. ప్రాకృత, తెలుగు, కన్నడ శాసనాలు ఉన్నాయి. స్వాతంత్య్ర సంగ్రామంలో చాలామంది ఇక్కడ నుంచి పాల్గొన్నారు. – ఈమని శివనాగిరెడ్డి, సిఈవో, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ ఇలా చేరుకోవాలి... రోడ్డు మార్గం: తెలుగు రాష్ట్రాలలోని అన్నిప్రాంతాల నుంచి ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది. రైలు మార్గం: మచిలీపట్నం అతి సమీప రైలుస్టేషన్. ఇక్కడ నుంచి ఘంటసాల 27కి.మీ. దూరంలో ఉంది. విమాన మార్గం: విజయవాడ అతి సమీప విమానాశ్రయం. ఇక్కడ నుంచి 50 కి.మీ. దూరం. ఇక్కడ నుంచి ఆర్టిసి బస్సులు, ప్రైవేట్ బస్సులు, టాక్సీలు దేవాలయం వరకు దొరుకుతాయి. ఆలయ సందర్శన వేళలు: ఉదయం 6.30 నుండి రాత్రి 9.30 వరకు అనేక ప్రత్యేకతలు ఆలయానికి ఎదురుగా గోపురం, మూడువైపులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఆలయ మహామండపానికి ఇరువైపులా పల్నాటి సున్నపురాయితో చెక్కిన భైరవుడు, నరసింహస్వామి విగ్రహాలున్నాయి. నరసింహస్వామి క్షేత్ర పాలకునిగాను, భైరవుడు ద్వారపాలకుని గాను ఉండటం ఆ ఆలయంలో మరో ప్రత్యేకత. సరస్వతీమాత, మరికొందరు దేవతామూర్తుల విగ్రహాలు మనలను భక్తి పారవశ్యంలో ముంచుతాయి. ఇక్కడ ఉన్న సరస్వతీదేవి విగ్రహం మొహంజొదారో కాలానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతారు. ఘంటసాలలో ఇంకా వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాంబ ఆలయం, భావనారుషి ఆలయం, రామాలయం, పెన్నేరమ్మ, ముత్యాలమ్మలకు కూడా దేవాలయాలు ఉన్నాయి. – డా. పురాణపండ వైజయంతి సాక్షి, విజయవాడ అవనిగడ్డ, కృష్ణాజిల్లా -
విభిన్నం.. అమ్మవారి దర్శనం
సాలూరు రూరల్ (పాచిపెంట) : చీపురువలస గ్రామ సమీపంలో కొండపై పురాతన పారమ్మ తల్లి ఆలయానికి విశిష్టత ఉంది. ఈ కొండపై పార్వతీదేవి విగ్రహాన్ని సుమారు 2400 ఏళ్ల క్రితం ప్రతిష్టించి ఉంటారని పురావస్తు శాఖ నిర్థారించినట్టు స్థానికుల కథనం. ఈ కొండ ప్రారంభంలో వినాయక గుడిలో పూజలు చేశాక భక్తులు పైకి వెళ్తారు. మార్గమధ్యంలో పాండవుల గుహ ఉంది. కొండ చివరన ఉన్న అమ్మవారు 36 చేతులు, శిరస్సుపై శివుడితో ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. అమ్మవారు వివిధ సమయాల్లో వివిధ రూపాల్లో కనిపిస్తుందని.. ఉగ్ర రూపంలో కనిపిస్తే గ్రామానికి చేటు జరుగుతుందని భక్తుల నమ్మకం. గతంలో ఈ కొండపై ఓ యాదవుడు ఎక్కుతూ జారిపడినప్పుడు అతని చేతిలోని పాలు ధారలు పడిపోయాయని, అవే వర్షాలు కురిసినప్పుడు మూడు ధారలుగా కొండపై నుంచి ప్రవహిస్తుందంటారు. ముఖ్యమైన పర్వదినాలు, మహాశివరాత్రి రోజు ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఈ రోజుల్లో ఆంధ్ర, ఒడిశా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శిఖరం చివర్లో ఏర్పాటుచేసే అఖండ జ్యోతి కొన్ని రోజుల పాటు అలాగే వెలుగుతుంటుంది. -
మధ్యయుగంలోనే ‘గాజు పరిశ్రమ’
నల్లగొండ జిల్లాలో లభించిన చారిత్రక ఆధారాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : చారిత్రక ఆధారాలకు నెలవైన నల్లగొండ జిల్లాలో మరో కీలక చారిత్రక ఆధారం లభ్యమైంది. మధ్యయుగ కాలంలోనే (క్రీ.శ. 8-12 శతాబ్దాలు) ఇక్కడ గాజు పరిశ్రమ ఉందని చెప్పేందుకు అవసరమైన ఆనవాళ్లు లభించాయి. జిల్లాలోని కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో బుధవారం పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో మధ్య యుగం నాటి రంగు పెంకులు లభించాయి. పచ్చడి పెట్టుకునే జాడీల లోపలి భాగం మాదిరిగా నున్నగా ఉన్న ఈ రాళ్లు ఆనాడే జిల్లాలో గాజు పరిశ్రమ ఉందని చెప్పేందుకు ఆధారాలని పురావస్తు అధికారులు చెపుతున్నారు. ఈ తవ్వకాల్లోనే తొలియుగం నాటి (క్రీ.శ. 1-3 శతాబ్దాలు) జీవన ఆధారాలు, మధ్యయుగంలో నిర్మించిన ప్రాచీన శివాలయం కూడా లభించింది. ఈ శివాలయంలో సప్తఅశ్వ (ఏడు గుర్రాలు) రథాన్ని నడుపుతున్న సూర్య భగవానుడి విగ్రహం కూడా లభించడం విశేషం. ప్రాచీన శివాలయం కూడా..: కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో జరిపిన తవ్వకాల్లో ఎక్కువగా కుండపెంకులే లభించాయి. నల్లని, ఎర్రని, రెండు రంగులు కలిపి ఉన్న పెంకులు పురావస్తు అధికారులు సేకరించారు. వీటితోపాటు తొక్కుడు బిళ్లలు (హాప్స్కాచ్), టైట మట్టితో చేసిన అద్దకపు పనిముట్లు, సానరాళ్లు లభించాయి. ఇవి చారిత్రక యుగాల ఆనవాళ్లని పురావస్తు అధికారులు చెపుతున్నారు. అదే విధంగా మధ్యయుగ కాలానికి సంబంధించి నలుపు, ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న పెంకులు కూడా లభించాయి. ఈ పెంకులన్నీ చౌడుమట్టితో తయారుచేసినవి. వీటిని సానబట్టి (పాలిష్ చేసి) నున్నగా తయారు చేశారు. ఈ తవ్వకాల్లోనే మధ్యయుగ కాలంలో (కాకతీయుల సామ్రాజ్యంలో) నిర్మించిన ఓ ప్రాచీన శివాలయాన్ని కూడా పురావస్తు అధికారులు గుర్తించారు. ఈ ఆలయం నిర్మించిన సమయంలో ఈ ప్రాంతాన్ని కాకతీయుల సామంతులైన కందూరు చోళులు పాలించారని అంచనా. -
ఆధ్యాత్మిక ఆనందం... అమ్మపల్లి ఆలయం
- బూరుగు ప్రభాకరరెడ్డి, సాక్షి, శంషాబాద్ హైదరాబాద్‌కు అతిచేరువలో.. శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఈ ఆలయం... రాష్ట్రంలోనే అతి పురాతన దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది.ఆలయానికున్న రాజగోపురం అలనాటి కళానైపుణ్యానికి, శిల్పసంపదకు తార్కాణంగా నిలిచింది. ఆలయ దైవమైన కోదండరాముడు కల్యాణరాముడుగా... అమ్మవారు సీతాదేవి సంతాన ప్రదాయినిగా, ఆలయ పరిసరాలు విజయ సోపానాలుగా భక్తుల మనస్సులో గుడికట్టుకున్నాయి. చూడముచ్చట గొలిపే ఎత్తై గోపురం.. నాటి కళావైభవానికి ప్రతీకగా నిలిచే ఆలయ ప్రాకారాలు... పక్షుల కిలకిలా రావాలు.. చుట్టూ పచ్చని పంట పొలాలు.. ఆధ్యాత్మికతను కలబోసుకున్న ఆహ్లాదకర వాతావరణం.. రాష్ట్రంలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా నిలిచిన ‘అమ్మపల్లి’ దేవాలయ ప్రత్యేకతను చాటుతోంది.. శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఈ ఆలయం సుమారు 400 ఏళ్ల కిందటిదని చరిత్ర చెబుతోంది. చారిత్రక సంపదగా వెలుగొందుతోంది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ప్రపంచ పటంలో గుర్తింపు పొందిన శంషాబాద్ మండలంలోని నర్కూడ సమీపంలో అమ్మపల్లి దేవాలయం నెలకొంది. శంషాబాద్‌కు దక్షిణ వైపు షాబాద్ రోడ్డులో నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆలయానికి చేరుకోవచ్చు. రోడ్డుపక్కన ముఖతోరణం (కమాన్) భక్తులకు స్వాగతం పలుకుతుంది. సుమారు 90 అడుగుల ఎత్తులో ఉండే రాజగోపురం.. ప్రధాన ద్వారంపై సేదతీరుతూ దర్శనమిచ్చే అనంత పద్మనాభస్వామి.. లోపలికి వెళ్లగానే విశాలమైన మహా మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో ఏకశిలా రాతి విగ్రహంపై శ్రీ లక్ష్మణ సమేతా సీతారామచంద్రస్వామి కొలువుదీరడం ఇక్కడి ప్రత్యేకత. విగ్రహాలపై దశావతారాల్లో మకర తోరణం కనిపిస్తుంటుంది. గర్భగుడి పైభాగంలో దశావతారాలు కళ్లకు కట్టినట్లు కళారూపాలుగా దర్శనమిస్తాయి. గర్భగుడికి ఎదురుగా శ్రీ ఆంజనేయస్వామి కొలువుదీరాడు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకారాలు ఉండగా దేవాలయానికి ఈశాన్యంలో కోనేరు, ఎదురుగా కళ్యాణమండపం, ఆ పక్కన వంటశాల, రథశాల ఉన్నాయి. వీటితోబాటు శివాలయం, హనుమాన్ దేవాలయం ఇక్కడ దర్శనమిస్తాయి. రాజగోపురంపై భిన్న సంస్కృతులకు చిహ్నంగా నాటి కళా నైపుణ్యాన్ని చాటిచెప్పే కళారూపాలు అబ్బురపరుస్తుంటాయి. రాజగోపురం మొత్తం ఏడు అంతస్థులు ఉండగా లోపలి నుంచి పైకి ఎక్కడానికి చెక్కతో చేసిన మెట్లు ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాలు మానసిక ప్రశాంతతను చేకూర్చుతాయి. దైవసన్నిధిలో ఎంత సమయం గడిపినా తనివి తీరదు. స్థలపురాణం అరణ్య వాస సమయంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో నడయాడినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. (అయోధ్య కాండ సమయంలో భద్రాచలం నుంచి జీడికల్లు, అలేరు మీదుగా శ్రీరాముడు అమ్మపల్లి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుని వంటిమిట్టకు వెళ్లినట్లు స్థానిక పెద్దలు పేర్కొంటున్నారు). 13వ శతాబ్దంలో ఇక్కడ శ్రీ కోదండరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనజరిగింది. ఆ తర్వాత సుమారు రెండు శతాబ్దాలకు అప్పటి పాలకులైన వేంగి రాజులు ఆలయ నిర్మాణం చేపట్టారు. శ్రీరాముడి కుడిచేతిలో విల్లు ధరించి ఉండడంతో శ్రీ కోదండరాముడుగా పిలవబడుతున్నాడు. సప్త ప్రాకార మంటపం, ఏకాదశ కలశ స్థాపన, సింహద్వారం, మండపంలో శ్రీ కూర్మ క్షేత్రం నిర్మాణం ఇక్కడి ప్రత్యేకతలు. విమాన గోపురంపై సప్త క్షేత్ర దర్శనాలతో నిర్మాణం చేపట్టారు. శ్రీరంగం, భద్రాచలం, అహోబిలం, వటపత్రశాల, కలియుగ వైకుంఠ, ద్వారక, క్షీరసాగర క్షేత్రాలతో విమాన గోపురాన్ని తీర్చిదిద్దారు. కల్యాణ రాముడంట కొమ్మలాలో..! అమ్మపల్లిలో కొలువుదీరిన శ్రీ కోదండరాముడు కల్యాణ రాముడుగా ప్రసిద్ధి చెందాడు. కల్యాణం, సంతానం వంటి కోర్కెలను నెరవేర్చుతూ భక్తుల గుండెల్లో కొలువై ఉన్నాడు. అంగరంగ వైభవం... ఆ కల్యాణం.. అమ్మపల్లిలో ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ మూర్తులను నర్కూడ నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో శ్రీ సీతారాముల కల్యాణం జరుపుతారు. కల్యాణానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. నిత్యం పూజాకార్యక్రమాలు, మాసకల్యాణం నిర్వహిస్తుంటారు. ఆలయం వద్ద ఎత్తై రాజగోపురం, విశాలమైన ప్రాంతం షూటింగ్‌లకు అనువుగా ఉండడంతో నాటితరం మేటి కథానాయకుడు నందమూరి తారక రామారావు నుంచి నేటి తరం వర్థమాన కథానాయికా నాయకుల చిత్రాల వరకు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఇక్కడ తీసిన చిత్రాలకు విజయం తథ్యమనే విశ్వాసం దర్శకనిర్మాతల్లో వేళ్లూనుకోవడంతో ఆలయం వద్ద ఎక్కువగా జాతర సన్నివేశాలు, పతాక సన్నివేశాలు, పాటల దృశ్యాలను చిత్రీకరిస్తుంటారు. అయితే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయం సరిపడా ఆదాయం లేక అరకొర సౌకర్యాలతో అంతంతమాత్రంగా ఉండటం శోచనీయం. ఎంతో ఆహ్లాదకరమైన పరిసరాలు గల ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది. లోక కల్యాణం కోసం.. ఇక్కడ శ్రీరాముడు లోక కల్యాణం కోసం కొలువు దీరినట్లు భక్తులు విశ్వసిస్తారు. సొంత కోర్కెల కంటే సమాజం బాగుకోసం కోరే మొక్కులను స్వామి తీర్చుతాడని భక్తుల నమ్మకం. శ్రీరామనవమి సందర్భంగా స్వామి కల్యాణంలో అందరూ పాల్గొనే అవకాశం ఉండదు. కావున ప్రతినెలా పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆలయంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నాం. భక్తులు కల్యాణంలో పాల్గొని స్వామి కృపను పొందుతున్నారు. - చేగొమ్మ సత్యనారాయణ మూర్తి ఆలయ పూజారి, అమ్మపల్లి ‘ఇన్‌టెక్’ అవార్డు అమ్మపల్లి దేవాలయం విశిష్టత, చారిత్రక సంపదను గుర్తించి ఇన్‌టెక్ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) వారు 2010లో హెరిటేజ్ అవార్డు ప్రకటించారు. సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయానికి వందల ఎకరాలు ఆస్తులు ఉన్నాయి. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయ ప్రాకారాలు నేడు శిథిలావస్థకు చేరుకోవడం శోచనీయం.