చిత్తూరు జిల్లా పరమనేరు సమీపంలోని కేటిల్‌ఫామ్ వద్ద ఉన్న అంత ర్రాష్ట్ర వాణిజ్యపన్నుల చెక్‌పోస్టు వద్ద ఆదివారం ఉదయం రూ.14 కోట్ల విలువైన బంగారంను పట్టుకున్నారు. ఈ సందర్భంగా కారు డ్రైవర్‌ను అరెస్ట్‌చేశారు. బెంగుళూరు నుంచి చిత్తూరువైపు వెళుతున్న కారును ఆపి తనిఖీ చేయగా అందులో 14 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను కనుగొన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేవు.
దీంతో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని కారు డ్రైవర్‌ను దుపులోకి తీసుకున్నారు. ఈ విషయం జిల్లా ఎస్పీకి తెలియజేశారు. ఏస్పీ బలమనేరు బయలుదేరారు. కాసేపట్లో ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించనున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తెలియజేశారు.