అనంతపురం అర్బన్: పదోన్నతి జాబితాలోని డిప్యూటీ తహసీల్దార్లకు శుభవార్త. పదోన్నతికి సంబంధించి డిపార్టమెంటల్ ప్రమోషన్ కమిటీ ఈ నెల 23న సమావేశం కానున్నట్లు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాలో తహసీల్దార్లుగా పదోన్నతి పొందాల్సిన డిప్యూటీ తహసీల్దార్లు ఏడుగురు ఉన్నారు. వీరంతా ఏడాదిగా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు.
ఎప్పటి కప్పుడు డీపీసీ సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం తేదీ ఖరారు కావడంతో వీరిలో సంతోషం వ్యక్తమవుతోంది. డీటీలు అనిల్‌కుమార్, శీలా జయరామప్ప, నారాయణ, రామశేఖర్, రామాంజినేయురెడ్డి, ఓబన్న, భాస్కరనారాయణ తహసీల్దారు పదోన్నతి జాబితాలో ఉన్నారు. డీపీసీ ఆమోదం లభిస్తే వీరందరికీ తహసీల్దారుగా పదోన్నతి లభించనుంది.
డిప్యూటీ తహసీల్దార్లకు శుభవార్త
Published Thu, Aug 17 2017 10:48 PM | Last Updated on Tue, Sep 12 2017 12:20 AM
Advertisement
Advertisement