పరిశోధనలతోనే మంచి ఫలితాలు | good result in investigations | Sakshi
Sakshi News home page

పరిశోధనలతోనే మంచి ఫలితాలు

Published Tue, Oct 18 2016 9:30 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

పరిశోధనలతోనే మంచి ఫలితాలు

పరిశోధనలతోనే మంచి ఫలితాలు

కానూరు(పెనమలూరు) : పరిశోధనలతోనే మంచి ఫలితాలు సాధించవచ్చని జేఎన్‌టీయూ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఎ.కృష్ణమోహన్‌ అన్నారు. కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో  మంగళవారం ఆయన పాల్గొని ప్రసంగించారు. కంప్యూటర్స్, ఐటీ రంగాల్లో నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో కంప్యూటర్‌ పాత్ర కీలకంగా ఉందన్నారు. నూతన ఆవిష్కరణలు చేయడం వలన అభివృద్ధి మరింత వేగవంతంగా చేయవచ్చని వివరించారు. డేటా ఎనలటిక్స్‌ టెక్నిక్స్‌ను ఆయన వివరించారు.  ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రత్నప్రసాద్, కంప్యూటర్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీనివాసరావు, ఐటీ విభాగాధిపతి డాక్టర్‌ సునీత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అమెరికాలో భారత్‌ విద్యార్థులకు గుర్తింపు
అమెరికాలో ఇంజినీరింగ్‌ చదివే భారత్‌ విద్యార్థులకు మంచి గుర్తింపు ఉందని మిచిగాన్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఎన్‌బింగ్‌లిన్‌ అన్నారు. పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఐటీ విభాగం ఆ«ధ్వర్యంలో ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు అంశం పై ప్రసంగించారు. అమెరికాలో భారత్‌ విద్యార్థులు ఉత్తమ ప్రతి¿¶  కనబరిచి ఉన్నత స్థానాల్లో ఉన్నారని వివరించారు. అమెరికాకు వచ్చే విద్యార్థులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.శివాజీబాబు, ఐటీ విభాగాధిపతి డాక్టర్‌ జె.రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement