సింగపూర్ సదస్సుకు ‘తాళ్ల పద్మావతి’ విద్యార్థిని ఎంపిక
-
అభినందించిన కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం
కరీమాబాద్ : సింగపూర్‌లో సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు జరుగనున్న ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఫార్మా కో ఎకనామిక్స్ అండ్ అవుట్‌కమ్ రిసెర్చ్(ఇస్పార్) అం తర్జాతీయ సదస్సుకు విద్యార్థిని కేతిరెడ్డి కిరణ్మయి ఎంపికైంది. ఆమె వరంగల్‌లోని తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో ఫార్మా–డీ కోర్సు చదువుతున్నారు. ఈ విషయాన్ని కళాశాల చైర్మన్ తాళ్ల మ ల్లేశం, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్‌రా వు ఆదివారం విలేకరులకు తెలి పారు. విద్యార్థిని కిరణ్మయి ‘డెవలప్‌మెంట్ వ్యాలిడేషన్ అండ్ పైలట్ టెస్టిం గ్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వశ్చనీర్’ అంశంపై రూపొందించిన పరిశోధనా పత్రాన్ని ఇస్పార్ పరిశీలించి, సదస్సుకు ఎంపిక చేసిందన్నారు. వివిధ దేశాలకు చెందిన 600 మంది విద్యార్థులు ఇస్పార్‌కు ప్రజెంటేషన్‌లు సమర్పించగా, వారిలో 20 మంది సదస్సులో పాల్గొనేందుకు అర్హత సాధించారని, ఇందులో భారత్ నుంచి ముగ్గురు ఉండగా.. కిరణ్మయి ఒకరని పేర్కొన్నారు.
ఐర్లాండ్ సదస్సుకు మరో ఇద్దరు విద్యార్థులు..
‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫార్మా కో ఎపిడెమాలజీ అండ్ థెరపిటిక్ రిస్క్ మేనేజ్‌మెంట్’ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 28 వరకు ఐర్లాండ్‌లో జరుగనున్న సదస్సుకు తమ కళాశాలకు చెందిన ఫార్మా–డీ విద్యార్థులు జి.ప్రదీప్, శైలా షర్మిన్ హాజరవుతున్నట్లు కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం తెలిపారు. సదస్సులో భారత దేశం నుంచి ఎంపికైన 15 మందిలో ఇద్దరు తమ కళాశాల విద్యార్థులే కావడం విశేషమన్నారు. వీరికి గైడ్‌లుగా తాళ్ల వరుణ్, విశ్వాస్, డాక్టర్ వెంకటేశ్వర్‌రావు వ్యవహరించనున్నారు. సమావేశంలో ఏఓ మధుసూదన్ పాల్గొన్నారు.