రేపటి నుంచి అంతర్జాతీయ సదస్సు
గుణదల (రామవరప్పాడు ) : అంతర్జాతీయ సదస్సు ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు లయోలా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిషోర్ తెలిపారు. కళాశాలలో సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కిషోర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి, 2016ను అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యవసాయం, ఆహారం, పర్యావరణ శాస్త్ర రంగాల్లో నూతన విధానాలు అనే అంశంపై మూడు రోజుల పాటు సదస్సు ఉంటుందని చెప్పారు. పోగ్రాం కన్వీనర్ శివకుమారి మాట్లాడుతూ మెట్ట పంటలైన కంది, మినుము, పెసర వంటి పలు పప్పు ధాన్యాల సమగ్ర యాజమాన్య పద్ధతులు, పలు రకాల కొత్త వంగడాల గురించి అవగాహన ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో కరస్పాండెంట్ ఫాదర్ రాజు, వైస్ ప్రిన్సిపాల్ మిల్కియార్, హెచ్‌వోడీలు పీ శ్రీనివాసరావు, కవిత, గ్లోరి పాల్గొన్నారు.