ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి
మంత్రి దేవినేని ఉమ
కానూరు (పెనమలూరు) :
ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కానూరులో జరుగుతున్న ఫొటోట్రేడ్‌షోలో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో వచ్చిన నూతన మార్పులను గుర్తించి సమాజానికి మరింత ఉన్నత సేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సంఘ అధ్యక్షుడు మాదాల రమేష్, సభ్యులు జానకీరామ్, శ్రీనివాస్, కృష్ణా, గుంటూరు జిల్లాల ఫోటో, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు.